రియాలిటీ షోలో బిగ్ బాస్ ది ప్రత్యేక స్థానం. ఎన్ని విమర్శలు, ట్రోలింగులు, కామెంట్లు వచ్చినా సరే దీన్నికొనసాగించడంలో నిర్వాహకులు, చూడటంలో ప్రేక్షకులు రాజీ పడటం లేదు. హిందీ, తమిళంతో పోలిస్తే తెలుగులోనే కొంత రేటింగ్స్ వెనుకబడి ఉన్న మాట వాస్తవం. జూనియర్ ఎన్టీఆర్, నానిలు చెరో సీజన్ చేశాక నాన్ స్టాప్ గా నాగార్జునే దీనికి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఓ రెండు సీజన్లు భారీ స్పందన తెచ్చుకున్నాయి కానీ గత కొంత కాలంగా స్పీడ్ తగ్గిపోయింది. ముఖ్యంగా ఇప్పుడు నడుస్తున్న ఏడో సిరీస్ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టడం లేదని డిజిటల్ టాక్.
ఇదిలా ఉండగా సీజన్ 8 కోసం స్టార్ మా సంస్థ బాలయ్యని సంప్రదించినట్టుగా వచ్చిన వార్త హాట్ టాపిక్ గా మారింది. ఇది నిజమైతే బిగ్ బాస్ షోకి అంత కన్నా కిక్ మరొకటి ఉండదు. నిర్మొహమాటంగా, ఫిల్టర్ లేకుండా బాలకృష్ణ మాట్లాడే తీరు ఖచ్చితంగా ఈ గేమ్ ని కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. ముఖ్యంగా వీకెండ్ లో వచ్చే ఎలిమినేషన్ ఎపిసోడ్లలో బాలయ్య పార్టిసిపెంట్స్ ని క్లాసులు పీకే తీరు టిఆర్పిని ఎక్కడికో తీసుకెళ్లడం ఖాయం. పైగా ఆయనతో ఉన్న చనువు, సందర్భాల దృష్ట్యా స్పెషల్ సెలబ్రిటీలు ఎవరు రమన్నా వస్తారు. దీంతో సహజంగానే ఫ్యాన్స్ లో ఆసక్తి పెరుగుతుంది.
అధికారికంగా చెప్పలేదు కనక ఇప్పటికిప్పుడు ధృవీకరించలేం కానీ నిప్పులేనిది పొగరాదు కాబట్టి ఏదో చర్చ జరిగే ఉంటుంది. అన్ స్టాపబుల్ షోని బాలకృష్ణ నడిపించిన తీరు ఆహా ఓటిటికి చాలా మైలేజ్ తీసుకొచ్చింది. అది చూసే హాట్ స్టార్ నిర్వాహకులకు హోస్ట్ ని మార్చే ఆలోచన వచ్చిందట. పైగా నాగార్జున వచ్చే ఏడాది వందో సినిమా మొదలుపెట్టబోతున్నారు. నా సామి రంగా రిలీజయ్యాక దీనికి సంబంధించిన పనులతో పాటు అన్నపూర్ణ బ్యానర్ పై వరస సినిమాలకు ప్లాన్ చేస్తారట. మరి బిగ్ బాస్ కుర్చీ నిజంగా చేతులు మారిందో లేదో తేలాలంటే ఇంకొంత కాలం వెయిట్ చేయాలి.
This post was last modified on November 2, 2023 10:52 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…