మూవీ లవర్స్ శివపుత్రుడుని మర్చిపోవడం అసాధ్యం. బాలా దర్శకత్వంలో రూపొందిన ఈ డిఫరెంట్ డ్రామాలో చియాన్ విక్రమ్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు మాటలే లేకుండా కేవలం ఎక్స్ ప్రెషన్లతో పాత్రను నిలబెట్టిన తీరు ఎన్ని అవార్డులు తెచ్చిందో లెక్క బెట్టడం కష్టం. సూర్య లొడలొడ వాగుతూ ఉన్నా కూడా విక్రమే మనల్ని ఎక్కువ వెంటాడుతాడు. ఆ తర్వాత మళ్ళీ ఎవరూ అంత ఇంటెన్సిటీతో మూగ పాత్రను పోషించలేదు.
దీని కన్నడ రీమేక్ లో ఉపేంద్ర లాంటి విలక్షణ నటుడు ఆ క్యారెక్టర్ చేసి చాలా బాగా నటించినా సరే విక్రమ్ ని మరిపించలేకపోయాడు. ఇప్పుడు తంగలాన్ లో మరో సాహసం చేయబోతున్నాడు. అసలు తిన్నాడా లేదా అనిపించే దేహంతో కరుడు కట్టిన బాడీ లాంగ్వేజ్ తో చాలా క్రూరంగా కనిపించబోతున్నాడు. ట్విస్ట్ ఏంటంటే ఇందులో విక్రమ్ పాత్రకు మాటలు ఉండవు.
ఆ విషయాన్నీ స్వయంగా తనే తెలుగు టీజర్ లాంచ్ ఈవెంట్ లో చెప్పేయడంతో షాక్ తినడం అభిమానులు, మీడియా వంతైంది. అదేంటి అంత అద్భుతమైన పాత్ర చేసి దాన్ని మూగగా చూపిస్తామంటే ఆడియన్స్ ఒప్పుకుంటారా. కానీ చియాన్ మాత్రం చాలా ధీమాగా తంగలాన్ ప్రపంచం కెజిఎఫ్, కాంతార, బాహుబలిలను మించి ఉంటుందని చెబుతున్నాడు. సో ఫ్యాన్స్ మానసికంగా మాటలే లేని విక్రమ్ ని చూసేందుకు రెడీ కావాల్సిందే.
ఇవాళ వదిలిన టీజర్ లోనూ మొత్తం సైలెంట్ గా కేవలం జివి ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో లాగించేశారు. చెన్నై టాక్ ప్రకారం తంగలాన్ నాగరిక భాష తెలియని ఒక ఆటవిక జాతి దశాబ్దాల క్రితం తమ కొండల్లో దాగి ఉన్న విలువైన బంగారాన్ని కాపాడుకోవడం చేసే యుద్ధం ఆధారంగా దర్శకుడు పా రంజిత్ తీర్చిదిద్దాడట. డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఉంటుందని, థియేటర్ నుంచి బయటికి వచ్చాక చాలా కాలం వెంటాడేలా తీశాడట. ఇంతగా ఊరిస్తున్నారంటే జనవరి 26 ఫస్ట్ షోనే చూసేయాలి.
This post was last modified on November 1, 2023 10:38 pm
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…