కళ్యాణ్ రామ్ డెవిల్ నవంబర్ 24 విడుదల నుంచి తప్పుకుంది. విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉండటం వల్లే వాయిదా వేస్తున్నామని యూనిట్ అధికారికంగా ప్రకటించింది. బ్రిటిష్ కాలంలో జరిగిన ఒక స్పై జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ పీరియాడిక్ థ్రిల్లర్ లో లక్కీ హీరోయిన్ సంయుక్త మీనన్ నందమూరి హీరోకి జోడిగా నటించింది. రిలీజ్ దగ్గరగా ఉన్నప్పటికీ ప్రమోషన్లు చేపట్టకపోవడం పట్ల గత కొద్దిరోజులుగా అభిమానుల్లో అనుమానాలు వ్యక్తమవుతూనే వచ్చాయి. ఇప్పుడవి నిజమై పోస్ట్ పోన్ కబురు వచ్చేసింది. కొత్త తేదీని ఇంకా ప్రకటించలేదు.
సరే అసలీ వాయిదా వెనుక మతలబేంటనే దాని మీద ఫిలిం నగర్ వర్గాల్లో రకరకాల వెర్షన్లు వినిపిస్తున్నాయి. డెవిల్ మొదలుపెట్టినప్పుడు దానికి దర్శకుడు నవీన్ మేడారం. రచనతో సహా పూర్తి బాధ్యతను తీసుకున్నాడు. కానీ తెరవెనుక ఏం జరిగిందో కానీ కొన్ని నెలల క్రితం నిర్మాత అభిషేక్ నామానే డైరెక్టర్ గా తన పేరు వేసుకుని ప్రమోషన్లు షురూ చేశారు. నవీన్ ఎందుకు తప్పుకున్నాడనే దాని గురించి ఈ రోజుకీ క్లారిటీ లేదు. మరోవైపు కళ్యాణ్ రామ్ ఈ వ్యవహారాల పట్ల సైలెంట్ గా ఉన్నాడు. ఏదైనా పాట ప్రమోషన్ ఉంటే దాన్ని ట్వీట్ చేయడం తప్ప ఇంకెలాంటి యాక్టివిటీ లేదు.
ప్రొడ్యూసర్ గా అభిషేక్ నామాకు ఎంత అనుభవమున్నా దర్శకుడిగా గ్రిప్ లేదు. పోస్ట్ ప్రొడక్షన్ అందులోనూ గ్రాఫిక్స్ కి సంబందించిన వ్యవహారం కాబట్టి పనులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయట. ఫైనల్ కాపీ దగ్గరలో సిద్ధమయ్యే సూచనలు లేకపోవడంతో వాయిదా తప్ప వేరే మార్గం లేకపోయిందని వినికిడి. ఇది పక్కాగా తెలుసుకున్నాకే ఆదికేశవ, కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ లు నవంబర్ 24ని తీసేసుకున్నాయి. అసలే డిసెంబర్, జనవరిలో ఏ ఒక్క వారం ఖాళీగా లేదు. మొత్తం భారీ చిత్రాలతో నిండిపోయాయి. మరి డెవిల్ ఫిబ్రవరి లేదా ఆపై నెలల్లో తప్ప ముందుగా వచ్చే ఛాన్స్ దాదాపుగా లేనట్టుగానే కనిపిస్తోంది.
This post was last modified on November 1, 2023 5:05 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…