గత కొన్నేళ్లలో తెలుగులో వచ్చిన అద్భుతమైన సినిమాల్లో ‘జెర్సీ’ ఒకటి. గత ఏడాది వేసవిలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నుంచి చక్కటి ఆదరణా దక్కించుకుంది. ఐతే విడుదలై కొంత కాలం గడిచాక ఈ సినిమా గొప్పదనం ఇంకా పెరుగుతూ వచ్చింది.
ఓటీటీలో, బుల్లితెరపై ఈ సినిమా చూసిన వాళ్లు ఇంత గొప్ప సినిమాను థియేటర్లలో మిస్సయ్యామే అనుకన్నారు. ఈ చిత్రం వేరే ఇండస్ట్రీల వాళ్లనూ ఆకర్షించింది. ఆల్రెడీ ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
షాహిద్ కపూర్ హీరోగా మాతృక దర్శకుడు గౌతమ్ తిన్ననూరినే హిందీ వెర్షన్‌ను రూపొందిస్తున్నాడు. టైటిల్ కూడా ‘జెర్సీ’నే. కరణ్ జోహార్‌తో కలిసి తెలుగు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని అక్కడ నిర్మిస్తున్నారు. లాక్ డౌన్ లేకుంటే ఈ పాటికి సినిమా పూర్తయ్యేది కూడా.
ఇప్పుడు ‘జెర్సీ’ తమిళంలోకి కూడా వెళ్లబోతోంది. యువ కథానాయకుడు విష్ణు విశాల్.. అక్కడ నాని పాత్ర పోషిస్తున్నాడు. హీరోయిన్ విషయంలో కొంత తర్జనభర్జన నడిచింది. శ్రద్ధ చేసిన పిల్లాడి తల్లి పాత్రను చేయడానికి యంగ్ హీరోయిన్లు ముందుకు రాలేదు. చివరికిప్పుడు సీనియర్ హీరోయిన్ త్రిష ఈ పాత్ర చేయడానికి అంగీకరించినట్లు సమాచారం.
రెండేళ్ల కిందట ‘96’ మూవీతో మెస్మరైజ్ చేసిన త్రిష.. తన సత్తా చాటడానికి ‘జెర్సీ’ మరో మంచి అవకాశంగా భావించినట్లుంది. విష్ణు బేసిగ్గా మంచి క్రికెటర్. తమిళ సినీ పరిశ్రమ తరఫున సెలబ్రెటీ క్రికెట్ లీగుల్లో అదరగొడుతుంటాడు.
అతను హీరోగా ఇంకతుముందు ‘జీవా’ పేరుతో ఓ క్రికెట్ మూవీ వచ్చింది. అందులో అతను చాలా బాగా చేశాడు. ఇప్పుడు ‘జెర్సీ’ రూపంలో అలాంటి మరో మంచి సినిమా రావడంతో జీవా మరో ఆలోచన లేకుండా అంగీకరించినట్లున్నాడు. ఓ కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు.
This post was last modified on August 27, 2020 4:17 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…