Movie News

ఏజెంట్ దర్శకుడి సుడి బాగుంది

మాములుగా ఒక దర్శకుడికి భారీ డిజాస్టర్ పడితే వెంటనే ఇంకో పెద్ద హీరోతో సినిమా సెట్ కావడం అంత సులభం కాదు, ఉదాహరణకు శ్రీకాంత్ అడ్డాలనే తీసుకుంటే మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ తో బ్రహ్మోత్సవం చేస్తే దాని ఫలితం దెబ్బకు ఏళ్ళ తరబడి ఇండస్ట్రీకి దూరంగా గడపాల్సి వచ్చింది. తిరిగి వచ్చి పెదకాపు 1తో దాన్ని నిలబెట్టుకోలేకపోవడం వేరే విషయం. కానీ సురేందర్ రెడ్డికి మాత్రం ఎక్కడో సుడి ఉంది. అఖిల్ కెరీర్ లో దారుణమైన ఫలితమందుకున్న మూవీగా ఏజెంట్ కి ఎంత చెడ్డపేరు వచ్చిందో మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఫుల్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ చేశామని నిర్మాతే చెప్పాడు.

అంత ఫ్లాప్ చూశాక కూడా సురేందర్ రెడ్డికి మంచి ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. నెలల క్రితమే పూజా కార్యక్రమాలు చేసి ఆఫీస్ ఓపెన్ చేశారు. ఇంకో వైపు వెంకటేష్ నాగ చైతన్య కాంబినేషన్ కు సరిపడా ఒక కథని సురేష్ బాబు బృందానికి వినిపించి పాజిటివ్ సిగ్నల్ తెచ్చుకున్నాడనే టాక్ ఫిలిం నగర్ వర్గాల్లో తిరుగుతోంది. వెంకటేష్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని వినికిడి. సంక్రాంతి తర్వాత లాక్ చేద్దామని అన్నారట. ఇవిలా ఉండగా తమిళ హీరో విక్రమ్ కూ ఒక స్టోరీ చెప్పిన సూరి అక్కడా సానుకూల స్పందన దక్కించుకున్నాడట.

పక్కా ప్లానింగ్ తో సురేందర్ రెడ్డి హీరోలను కలుస్తున్న తీరు బాగుంది. వీటిలో ఏది ముందు మొదలవుతుందని ఇప్పుడే చెప్పలేం కానీ ఏజెంట్ తర్వాత నిరాశ చెందకుండా వెంటనే పరుగులు పెట్టడం మంచిదే. సైరా నరసింహారెడ్డి సైతం సూరికి ఆశించిన స్థాయిలో గొప్ప ఫలితాన్ని ఇవ్వలేదు. మళ్ళీ కిక్, రేస్ గుర్రం, అతనొక్కడే లాంటి మాస్, యాక్షన్, కామెడీ కలగలిసిన ఎంటర్ టైనర్స్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అన్నట్టు రవితేజ కోసం కూడా సూరి ట్రై చేస్తున్నాడని మరో టాక్. వీటిలో ఏ రెండు వర్కౌట్ అయినా చాలు ఒక్కసారిగా స్టార్ హీరోలతో కాంబోలు సెట్ చేసుకోవచ్చు. 

This post was last modified on October 30, 2023 3:34 pm

Share

Recent Posts

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

42 minutes ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

2 hours ago

100 కోట్ల ప్రయాణాల స్త్రీ శక్తి!

ఏపీలో కూట‌మి స‌ర్కారు అమ‌లు చేస్తున్న స్త్రీ శ‌క్తి ప‌థ‌కం రికార్డ్ సృష్టించింది. గ‌త ఏడాది ప్రారంభించిన ఈ ప‌థ‌కం…

4 hours ago

నక్సలైట్ అడవుల్లో నవ్వుల ‘కళ్యాణ్’

అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…

4 hours ago

సంచలనం… లెజెండరీ ఇండియన్ కెప్టెన్ గుడ్‌బై

ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…

6 hours ago

బాబు పవన్ భేటీ… స్థానిక ముడి పడినట్టేనా?

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…

7 hours ago