తన గ్యాంగ్స్ అఫ్ గోదావరి ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ లోనే విడుదలవుతుందని, అలా జరగని పక్షంలో ప్రమోషన్లలో కనిపించనని విశ్వక్ సేన్ చేసిన ఆన్ లైన్ శపథం ఎంత వైరల్ అయ్యిందో చూశాం. తర్వాత కొన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ లో డిలీట్ చేశాడు కానీ అప్పటికే వ్యవహారం చాలా దూరం వెళ్లిపోయింది. అయితే అతను డిసెంబర్ నెల అన్నాడు కానీ ఎనిమిదో తేదీ అని నొక్కి చెప్పలేదు. సో ఏ డేట్ అయినా తీసుకోవచ్చు. ఆ దిశగానే సితార అధినేత నాగవంశీ ఎడతెరిపి లేకుండా దీని గురించి చర్చలు చేస్తూనే ఉన్నారట. ఫైనల్ గా అవి కొలిక్కి వచ్చినట్టు సమాచారం.
హాయ్ నాన్న, ఆపరేషన్ వాలెంటైన్, ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ తో తలపడటం కన్నా సోలోగా డిసెంబర్ 29న రావడం సేఫ్ గేమ్ అవుతుందనే ఆలోచన సీరియస్ గా జరుగుతున్నట్టు తెలిసింది. అయితే ఇక్కడ చాలా పెద్ద రిస్క్ పొంచి ఉంది. సలార్ 22 వస్తుంది. ప్రభాస్ మేనియా గురించి తెలిసిందే. పైగా కెజిఎఫ్ ప్రశాంత్ నీల్ దర్శకుడు. సరైన టీజర్ రాకుండానే అంచనాలు ఆకాశాన్ని దాటుతున్నాయి. పైగా షారుఖ్ ఖాన్ డుంకీ కూడా 21నే వస్తోంది. ఈ రెండింటికి కనీసం నెలాఖరు దాకా థియేటర్ అగ్రిమెంట్లు జరుగుతాయి. జనాలు కూడా వీటిని చూసేందుకే ప్రాధాన్యం ఇస్తారు.
అలా అని గ్యాంగ్స్ అఫ్ గోదావరికి స్క్రీన్ల ఇబ్బంది రాదు. ఎందుకంటే గుంటూరు కారం కొంటున్న డిస్ట్రిబ్యూటర్లు ఖచ్చితంగా విశ్వక్ సినిమాకు సహకరిస్తారు. అది కాదు అసలు సమస్య. సలార్ కనక బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే ముఖ్యంగా మాస్ సెంటర్స్, మల్టీప్లెక్స్ ఆడియన్స్ ని విశ్వక్ వైపు లాగడం అంత సులభంగా కాదు. కుర్రాడి సినిమా కూడా ఊర మాస్ కంటెంటే కానీ రేంజ్ ప్రకారం చూసుకుంటే ఎక్కడా పోలిక రాదు. ఈ లెక్కలన్నీ ఎందుకు కంటెంట్ ఉంటే ఆడుతుందనే ధీమాతో గోదావరి టీమ్ అడుగు ముందుకు వేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఈ రెండు మూడు రోజుల్లోనే క్లారిటీ రావొచ్చు.
This post was last modified on October 29, 2023 11:15 pm
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా చివరి ఉత్తర్వుల్లో అద్భుత ట్విస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా కుటుంబ…
మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సాకే శైలజానాథ్.. తాజాగా వైసీపీ గూటికి చేరారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం…
సినీ రంగంలో నటులుగా తొలి అవకాశం రావడం ఒకెత్తయితే.. తొలి సక్సెస్ అందుకోవడం ఇంకో ఎత్తు. కొందరికి తొలి అవకాశంతోనే…
అక్కినేని నాగార్జున… టాలీవుడ్ లో సీనియర్ నటుడు. రాజకీయాలతో పని లేకుండా ఆయన తన పని ఎదో తాను ఆలా…
ఇవాళ విడుదలైన తండేల్ కు మంచి టాకే వినిపిస్తోంది. అదిరిపోయింది, రికార్డులు కొల్లగొడుతుందనే స్థాయిలో కాదు కానీ నిరాశ పరచలేదనే…
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. గత కొన్నేళ్లలో సోషల్ మీడియా వేదికగా హద్దులు దాటి ప్రవర్తించిన వైసీపీ కార్యకర్తలు,…