మెగా వెడ్డింగ్ కి కౌంట్ డౌన్ దగ్గరికి వస్తోంది. తెరపై జంటగా కనిపించిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకను చూసేందుకు అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నేరుగా చూసే అవకాశం లేకపోయినా టీవీలో వీడియోల్లో ఏదో ఒక రూపంలో బయటికి వస్తాయి. ఇదిలా ఉండగా ఇటలీలో జరగబోయే ఈ గ్రాండ్ ఈవెంట్ కోసం రెండు ఫ్యామిలీలు అక్కడికి చేరుకున్నాయి. నిన్న పవన్ కళ్యాణ్ సతీసమేతంగా బయలుదేరిన సంగతి తెలిసిందే. చిరంజీవి, చరణ్, ఉపాసనతో పాటు అన్ని కుటుంబాలు సందడి చేస్తున్నాయి. ఇక ఈవెంట్ ప్లానింగ్ కి సంబంధించిన కొన్ని కీలక విషయాలు చూద్దాం.
అక్టోబర్ 30 అంటే రేపటి నుంచి ప్రీ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ముందు కాక్ టైల్ పార్టీ ఉంటుంది. ఇది మొదటి లాంఛనం. మరుసటి రోజు 31న మెహందీ, హల్దీ వేడుకలు ఉంటాయి. చాలా సాంప్రదాయ బద్దమైన థీమ్ ని వరుణ్ జంట ఎంచుకున్నట్టు తెలిసింది. హడావిడి అతిగా లేకుండా డీజే శబ్దాలకు దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో ఆడుతూ పాడుతూ జరిగేలా ముందే ప్లాన్ చేసుకున్నారట. అసలైన ముహూర్తం నవంబర్ 1న టుసానిలో ఉన్న బార్గో సాన్ ఫెలిస్ రిసార్ట్ లో పెళ్లి ఘట్టం ఉంటుంది. దీనికి టాలీవుడ్ నుంచి వరుణ్, లావణ్యల ఒకరిద్దరు బెస్టీస్ హాజరు కాబోతున్నారు.
ఇది పూర్తి కాగానే వెంటనే తిరుగు ప్రయాణం చేసుకుని నవంబర్ 5న హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిసింది. దీనికి రాజకీయ, సినీ ప్రముఖులు భారీగా హాజరు కాబోతున్నారు. నాగబాబు బిడ్డ ఫంక్షన్ కావడంతో పలువురు జనసేన ప్రతినిధులు, టిడిపి నాయకులు రాబోతున్నారు. కొత్త జంట పెళ్లి బట్టలను సుప్రసిద్ధ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేయగా స్టయిలింగ్ బాధ్యతలు అశ్విన్ మావ్లే, హస్సన్ ఖాన్ లు చూసుకుంటున్నారు. ఇంకో మూడు రోజుల్లో వరుణ్ లావణ్యల వేడుక ఫోటోలు వీడియోలతో సోషల్ మీడియా హోరెత్తిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on October 29, 2023 6:47 pm
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…
మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…
నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…
ఈ శుక్రవారం ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇంత పోటీలో వస్తున్నపుడు ప్రేక్షకుల దృష్టి తమ చిత్రం మీద…