మొన్న దసరా పండక్కు దాదాపు పెద్ద హీరోల అప్డేట్స్ అన్ని వచ్చాయి. ముఖ్యంగా నిర్మాణంలో ఉన్న సినిమాల తాలూకు పోస్టర్లో లోగోలో ఏవో ఒకటి ఫ్యాన్స్ కోసం నిర్మాణ సంస్థలు పంచుకున్నాయి. ఇంకా షూటింగ్ మొదలుకాని మెగా 156 సైతం పాట రికార్డింగ్ తో గుడ్ న్యూస్ చెప్పింది. అయితే ఒక్క హరిహర వీరమల్లు మాత్రం పూర్తిగా మిస్ కావడం అభిమానులు గుర్తించకుండా పోలేదు. ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి నుంచి స్పెషల్ పోస్టర్లు వచ్చాయి తప్పించి ఆయుధం చాలా కీలకంగా వ్యవహరించే వీరమల్లు నుంచి ఎలాంటి స్టిల్ రాకపోవడం ఫ్యాన్స్ ని తీవ్ర అసంతృప్తికి గురి చేసింది.
నెలల తరబడి దర్శకుడు క్రిష్ మౌనంగా ఉన్నారు. నిర్మాత ఏఎం రత్నం తప్పని పరిస్థితుల్లో రూల్స్ రంజన్, 7జి బృందావన్ కాలనీ ఈవెంట్లలో ఏదో మొక్కుబడిగా వచ్చే ఏడాది రిలీజన్నారు కానీ దాని సూచనలు దరిదాపుల్లో కూడా లేవు. పవన్ ఇంకో మూడు నాలుగు నెలల్లో ప్రచారంలో బిజీ అయిపోతాడు. జనసేన టిడిపి కలయిక నేపథ్యంలో ఈసారి షెడ్యూల్ చాలా టైట్ గా ఉండబోతోంది. స్వంత పార్టీ అభ్యర్థుల కోసం తిరుగుతూనే మరోవైపు తెలుగుదేశం కాండిడేట్ల కోసం కూడా క్యాంపైన్లు చేయాల్సి ఉంటుంది. ఇంత టఫ్ సిచువేషన్ లో పవన్ ఓజి, ఉస్తాద్ లో ఒక్కటి పూర్తి చేసినా గొప్పే.
ఎలా చూసుకున్న హరిహర వీరమల్లు 2024 వేసవి తర్వాత బాలన్స్ షూటింగ్ కు వెళ్లేలా ఉంది తప్ప అంతకన్నా ముందు ఛాన్స్ లేనట్టే. క్రిష్ మాత్రం అనుష్క కోసం ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ కథను సిద్ధం చేసుకుని ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నట్టేనని ఇన్ సైడ్ టాక్. స్వీటీ ప్రస్తుతం ఈ సినిమాతో పాటు చిరంజీవి వసిష్ఠ సినిమాలు చేసేందుకు సుముఖంగా ఉంది. ఒప్పుకున్నది లేనిది అధికారిక ప్రకటన వస్తే తప్ప చెప్పలేం. అసలు ఫ్యాన్సే మర్చిపోయేలా హరిహర వీరమల్లుని సైడ్ ట్రాక్ పట్టించడం అనూహ్యం. పవన్ మొదటి ప్యాన్ ఇండియా మూవీగా మొదట్లో ఉన్న హైప్ ఇప్పుడు నీరుగారిపోయింది.
This post was last modified on October 29, 2023 6:27 pm
తండ్రి ఒకప్పుడు నెంబర్ వన్ సూపర్ స్టార్, మరోవైపు అన్న మినిమమ్ హిట్స్ అందుకుంటున్నాడు. కానీ తమ్ముడు మాత్రం ఒకప్పుడు…
కెరీర్ లోనే అతి పెద్ద ప్యాన్ ఇండియా మూవీగా కంగువ మీద బోలెడు ఆశలు పెట్టుకున్న సూర్యకి అది కోలీవుడ్…
మల్లువుడ్ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ మనకూ సూపరిచితుడే. స్ట్రెయిట్ సినిమాలు ఎక్కువ చేయనప్పటికీ డబ్బింగ్ ద్వారా రెగ్యులర్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దూకుడు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. మాట తీరు ఆచితూచి ఉన్నా..…
ఏపీలో తాజాగా జపాన్లో టాయామా ప్రిఫెడ్జర్ ప్రావిన్స్ గవర్నర్ సహా 14 మంది ప్రత్యేక అధికారులు.. అక్కడి అధికార పార్టీ…
రెండు అంటే రెండు పిజ్జాల కోసం ఎంత ఖర్చు చేస్తారు? వెయ్యి రూపాయిలు. కాదంటే రెండు వేలు. అదీ కూడా…