యూత్ హీరో విశ్వక్ సేన్ తన కొత్త సినిమా గ్యాంగ్స్ అఫ్ గోదావరి విడుదల తేదీ విషయంలో జరుగుతున్న పరిణామాల పట్ల సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఎట్టి పరిస్థితిలో డిసెంబర్ నెలలోనే విడుదలవుతుందని, అలా జరగని పక్షంలో ఇకపై తనను ప్రమోషన్లలో చూడరని నేరుగా అల్టిమేటం ఇవ్వడం ఆదివారం ఉదయం షాక్ ఇచ్చింది. బ్యాక్ గ్రౌండ్ లేని తనలాంటి వాళ్ళను అణచడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని, ఇక సహించే ప్రసక్తే లేదనే రీతిలో ఏకంగా దేవుళ్ళ మీద ఒట్టేసి మరీ సవాల్ విసరడం ఊహించని పరిణామం.
నిజానికి గ్యాంగ్స్ అఫ్ గోదావరి నిర్మించింది చిన్న సంస్థ కాదు. సితార నాగవంశీకున్న నెట్ వర్క్, డిస్ట్రిబ్యూషన్ పట్టు, చేతిలో ఉన్న పెద్ద సినిమాల సంగతి తెలిసిందే. బాలయ్య, రవితేజలు పోటీలో ఉన్నప్పటికీ లియోకి సరిపడా థియేటర్లు వచ్చేలా చేసుకోవడం దసరా టైంలో చూశాం. అలాంటిది ఇప్పుడు కొత్తగా ఇబ్బందులు తలెత్తుతాయని అనుకోలేం. అయితే హాయ్ నాన్న, ఆపరేషన్ వాలెంటైన్ లు వెనుకడుగు వేసే పరిస్థితి లేకపోవడంతో గ్యాంగ్స్ అఫ్ గోదావరినే వాయిదా వేయొచ్చనే వార్తల నేపథ్యంలో విశ్వక్ సేన్ ఇంత తీవ్రంగా స్పందించి ఉండొచ్చనే అనుమానం పలువురు వ్యక్తం చేస్తున్నారు.
తన కొత్త చిత్రం రిలీజ్ దగ్గరపడిన ప్రతిసారి విశ్వక్ ఏదో ఒక వివాదంలో ఉండటం కాకతాళీయమో లేక ఇంకేదైనా కారణమో అంతు చిక్కడం లేదు. పాగల్ టైంలోనూ హిట్టు కాకపోతే పేరు మార్చుకుంటానని స్టేట్ మెంట్ ఇచ్చాడు. పలు సందర్భాల్లో తనను తొక్కడానికి చూస్తున్నారని చెప్పుకొచ్చాడు. అయితే మరీ ఇంత ఓపెన్ గా విడుదల తేదీ మారితే పబ్లిసిటీ దూరంగా ఉంటానని ఒక అప్ కమింగ్ హీరో ఏకంగా పబ్లిక్ నోట్ వదలడం మాత్రం ఇదే మొదటిసారని చెప్పొచ్చు. ఆ మధ్య నిఖిల్ కార్తికేయ 2 టైంలోనూ ఇలాంటి ఇబ్బందే ఫేస్ చేశారు. ఈ లెక్కన గ్యాంగ్స్ అఫ్ గోదావరి పోస్ట్ పోన్ ఛాన్స్ లేనట్టే.
This post was last modified on October 29, 2023 12:55 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…