సోషల్ మీడియా అంటే రెండు వైపులా పదునున్న కత్తి. ఇక్కడ ముఖానికి ముసుగు వేసుకుని ఏం మాట్లాడినా.. ఏ పోస్టు పెట్టినా.. ఏం షేర్ చేసినా చెల్లిపోతుంది అనుకుంటే పొరపాటే. పోలీసులు కొంచెం ఫోకస్ చేశారంటే ఊచలు లెక్కబెట్టక తప్పదు. ఇప్పుడు తెలుగు ట్విట్టర్లో జరిగిన ఒక పరిణామం చూస్తే.. అక్కడ వెర్రి వేషాలు వేసే వాళ్లందరికీ వణుకు పుడుతుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా అమ్మాయిలకు సంబంధించి పర్సనల్ వీడియోలు షేర్ చేస్తే ఎంతటి తీవ్ర పరిణామాలుంటాయో చెప్పడానికి ఒక తాజా ఉదంతం ఉదాహరణ.
తెలుగు ట్విట్టర్లో సినిమాల గురించి పోస్టులు పెడుతూ.. ఫ్యాన్ వార్స్‌లో భాగం అయ్యే ఎంబీ రమేష్ నాయక్ అనే కుర్రాడు.. తాజాగా ఒక పోస్టు పెట్టాడు. ఒక యంగ్ అమ్మాయికి సంబంధించిన వీడియో ఉందని.. ఆ వీడియో కావాలంటే 50 రూపాయలు ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ తనకు షేర్ చేయాలని అతను పోస్టు పెట్టాడు. దీనికి స్పందించి బోలెడంతమంది నెటిజన్లు అతడికి డబ్బులు పంపారు. ఈ ట్వీట్ బాగా వైరల్ అయింది. వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది.
సైబర్ క్రైమ్ వాళ్లు ఆ కుర్రాడి మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఆ కుర్రాడు ఇంతకుముందు కూడా ఇలాంటి పోస్టులు పెట్టినట్లు తేలడంతో సోషల్ మీడియా డేటా అంతా బయటికి తీస్తున్నారు పోలీసులు. దీంతో ముందు వెనుక చూసుకోకుండా ఇలాంటి పోస్టులు పెట్టే వాళ్లందరిలో గుబులు మొదలైంది. ఇలాంటి వ్యక్తుల గురించి చాలామంది రిపోర్ట్ చేస్తూ.. పోస్టులు సేవ్ చేయడం, స్క్రీన్ షాట్లు తీయడం చేస్తున్నారు. సోషల్ మీడియాలో హద్దులు దాటి ప్రవర్తించే వాళ్లందరికీ ఇది హెచ్చరికగా భావిస్తున్నారు. ఇలాంటి వ్యవహారాల మీద పోలీసులు ప్రెస్ మీట్లు లాంటివి పెట్టి నెటిజన్లను అలెర్ట్ చేయాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on October 29, 2023 12:01 am
సౌత్ ఇండియా మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరున్న అనిరుధ్ రవిచందర్ తమిళంలోనే విపరీతమైన బిజీగా ఉన్నా తెలుగు…
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో.. సామాన్యులకు కూడా టిక్కెట్లు ఇచ్చామంటూ వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురించి గురువారం నాటి పార్లమెంట్ సమావేశాల్లో ఓ కీలక అంశం…
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శుక్రవారం గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా…
రుణాలఫై వడ్డీ రేట్లు గత కొంత కాలంగా పెరుగుతూనే ఉన్నాయి. గడచిన ఐదేళ్లుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దేశ ఆర్థిక…
ఏడాదిన్నరగా ఒకే సినిమా మీద దృష్టి పెట్టి ఒళ్ళు, మనసు రెండూ కష్టపెట్టి నాగచైతన్య చేసిన సినిమా తండేల్. గత…