లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇంకో ఆరు నెలలు ఆశలు పెట్టుకునే పరిస్థితి లేదని పరిశ్రమ పెద్దలు అంటున్నారు. థియేటర్లు పున:ప్రారంభమయ్యాక కూడా కొంత కాలం పాటు ఆశించిన స్థాయిలో రెవెన్యూ ఉండదంటున్నారు.
ఈ నేపథ్యంలో చిన్న సినిమాల నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. అప్పటి వరకు వడ్డీల భారం మోయడం కన్నా ఎంత ఆదాయం వస్తే అంత చాలనుకుని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో నేరుగా రిలీజ్ చేసేయడానికి రెడీ అవుతున్నారు. తమిళంలో ఇలా రిలీజ్ కాబోతున్న తొలి సినిమాగా జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ‘పొన్ మగల్ వందాల్’ సినిమా ప్రచారంలోకి వచ్చింది. ఇంకొన్ని రోజుల్లోనే ఆ చిత్రాన్ని అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాత ప్రకటించాడు.
కానీ ఈ ప్రకటన తమిళనాడు థియేటర్ల సంఘానికి నచ్చట్లేదు. జ్యోతిక సినిమాను ప్రైమ్‌లో విడుదల చేయడంపై ఆ సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. థియేటర్లలో రిలీజ్ చేయడం కోసం రూపొందించిన సినిమాను నేరుగా ఓటీటీల్లో ఎలా రిలీజ్ చేస్తారని ఆ సంఘం ప్రశ్నించింది. తమ మాట కాదని జ్యోతిక సినిమాను ప్రైమ్‌లో రిలీజ్ చేస్తే.. భవిష్యత్తులో సూర్య సినిమాలతో పాటు అతడి నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్స్ బేనర్ నుంచి వచ్చే ఏ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ కానివ్వమని ఆ సంఘం ప్రతినిధులు ఓ ప్రకటనలో హెచ్చరించారు.
ఇంతకుముందు కమల్ హాసన్ ‘విశ్వరూపం’ను నేరుగా డీటీహెచ్‌ల్లో రిలీజ్ చేయాలని నిర్ణయించగా అప్పుడు కూడా తమిళనాడు థియేటర్ల సంఘమే అడ్డు పడింది. చివరికి వాళ్ల ఒత్తిడికి కమల్ తలొగ్గక తప్పలేదు. మరి ఇప్పుడు జ్యోతిక సినిమా నిర్మాత ఏం చేస్తాడో చూడాలి. ఇలా ఒక సినిమా రిలీజై మంచి స్పందన రాబట్టుకుంటే వరుసబెట్టి చాలా సినిమాలు రిలీజవుతాయని.. దీంతో భవిష్యత్తులో తమ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని థియేటర్ల యజమానులు కంగారు పడుతున్నట్లు కనిపిస్తోంది.
This post was last modified on April 25, 2020 5:14 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…