ప్రపంచంలో ఏ స్టార్ హీరో తన అభిమానులను తప్పులు చేయమని ప్రేరేపించడు. పైపెచ్చు మంచిని ప్రోత్సహిస్తూ సమాజ సేవ గురించి, రక్తదానాలు, అన్నదానాలు, ఊరి దత్తతలు లాంటి వాటికి స్ఫూర్తినిస్తారు. అందరూ ఫాలో అవుతారన్న గ్యారెంటీ లేదు. కానీ ఏదైనా చెడు జరిగినప్పుడు మాత్రం అదే పనిగా హీరో పేరుని హైలైట్ చేయడం పరిపాటిగా మారింది. నిన్న ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే ఒక పెద్ద స్టార్ హీరో ఫ్యాన్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. మార్ఫ్ చేసిన అమ్మాయిల అసభ్యకర వీడియోలను 50 రూపాయలకు ట్విట్టర్ లో అమ్ముతున్నాడనే అభియోగంతో కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలిస్తున్నారు.
ఇలాంటి పనికిమాలిన పనులకు స్వంత తల్లితండ్రులే హర్షించరు. అలాంటిది హీరోలు మాత్రం ఎందుకు ఉపేక్షిస్తారు. కానీ కొన్ని ఛానల్స్ లో అదే పనిగా సదరు స్టార్ ని హెడ్ లైన్స్ లో పెడుతూ అతని అభిమాని నేరం చేశాడంటూ ఒకటే ఊదరగొడుతున్నారు. ఆ వ్యక్తికి నేరుగా తాను ఇష్టపడే సెలబ్రిటీతో ఎలాంటి సంబంధం లేదు. మహా అయితే ఏదైనా ఫోటో షూట్ జరిగినప్పుడు వెళ్లి పిక్స్ తీసుకుని ఉండొచ్చు. అంతకు మించి కనీసం మొహం గుర్తుండే పరిచయం కూడా ఉండదు. అలాంటప్పుడు ఓ యువకుడు అని సంబోధించే బదులు ఇలా చేయడమే విమర్శలకు తావిస్తోంది.
ఇకనైనా అత్యుత్సాహంతో ట్విట్టర్ లో ఓవరాక్షన్ చేసే కొందరు యువకులు ఈ సంఘటనను హెచ్చరికగా తీసుకోవాలి. తామేం చేసినా చెల్లుతుంది, ఆన్ లైన్ లో మనల్ని ఎవరు పట్టుకుంటారనే నిర్లిప్తత ఖచ్చితంగా తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. పైగా పోలీసు వ్వవస్థ మునుపెన్నడూ లేనంత స్థాయిలో సాంకేతికతను వాడుకుని క్షణాల్లో నిందితులను పట్టుకుంటోంది. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా తప్పు చేసినవాళ్లు దొరికిపోవడం ఖాయం. ఇప్పుడదే జరిగింది. కొన్నేళ్ల క్రితం ఫ్యాన్ వార్ ఓ హత్యకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఇకనైనా మేలుకుని మంచేదో చెడేదొ గుర్తించడం కీలకం.
This post was last modified on October 28, 2023 4:53 pm
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…