బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత దర్శకుడు నిర్వహించే కాఫీ విత్ కరణ్ సిరీస్ కి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సెలబ్రిటీలను తీసుకొచ్చి వాళ్ళ వ్యక్తిగత విషయాలను, అవసరమైతే లోతైన పర్సనల్ సంఘటనలు అడిగి మరీ నిజాలు రాబట్టడం ఆయన స్పెషాలిటీ. తాజాగా రణ్వీర్ సింగ్, దీపికా పదుకునే జంటగా తీసుకొచ్చి చేసిన ముఖాముఖీ ఇండస్ట్రీ వర్గాలతో పాటు ముగ్గురు స్టార్ల అభిమానుల్లో హాట్ డిస్కషన్ కు దారి తీసింది. ఇది ఎంత దూరం వెళ్లిందంటే గతంలో వీళ్ళు ఇతరత్రా టాక్ షోలలో మాట్లాడిన మాటలు, ఇప్పుడు వాటితో పొంతన లేకుండా చెప్పిన సమాధానాలకు ముడి పెడుతున్నారు.
తమ ప్రేమకథను చెప్పుకునే క్రమంలో భాగంగా దీపికా రణ్వీర్ సింగ్ పరిచయానికి ముందు ఎంత మెకానికల్ గా ఉండేదో, అనుబంధాల పట్ల ఎంత తేలికగా తీసుకునేదో చెప్పింది. భర్త కన్నా ముందు ముగ్గురు నలుగురితో ఫ్రెండ్ షిప్ చేసినా వాళ్లకు లేని కమిట్ మెంట్ రణ్వీర్ లో చూడటం వల్లే మూడు ముళ్ల దాకా తీసుకొచ్చానని వివరించింది. ఇక్కడ కమిట్ మెంట్ అనే పదాన్ని రెండుసార్లు నొక్కి చెప్పింది. నెటిజెన్లు దాన్ని ఇంకోలా అర్థం చేసుకుని ఎప్పుడో మర్చిపోయినా దీపికా, రన్బీర్ కపూర్ పాత స్నేహాన్ని, లవ్ స్టోరీ తాలూకు జ్ఞాపకాలను తవ్వి తీసి వాటిని వైరల్ చేయడం మొదలుపెట్టారు.
పక్కనే కూర్చున్న రణ్వీర్ సింగ్ సైతం ఇవన్నీ తనకు తెలుసని, కాకపోతే కొన్ని సంగతులు ఇంటికి వెళ్లి మాట్లాడుకుందామని దీపికాకు చెబుతున్న వీడియో అంతే వేగంగా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇంతే కాదు క్రికెటర్ యువరాజ్ సింగ్ తో దీపికా కొంత కాలం స్నేహంగా ఉందనే ఫ్లాష్ బ్యాక్ నీ గుర్తు చేస్తున్నారు. డేటింగ్, సెక్స్, లివిన్ రిలేషన్స్ గురించి కావాలని ప్రస్తావనకు తెచ్చే కరణ్ జోహార్ కు ఇప్పుడీ జంట వల్ల సదరు ఎపిసోడ్ కి హయ్యెస్ట్ రేటింగ్స్ రావడం పట్ల సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడట. అంతే మరి పబ్లిక్ కి కావాల్సింది తారల ప్రైవేట్ లైఫ్. వాటిని ఎంతగా తవ్వితే అంత మైలేజ్.
This post was last modified on October 27, 2023 7:04 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…