గత ఏడాది సర్ప్రైజ్ బ్లాక్ బస్టర్ గా నిలిచి సిద్దు జొన్నలగడ్డకు యూత్ లో ఫాలోయింగ్ పెంచి స్టార్ బాయ్ గా మార్చిన డీజే టిల్లుకి కొనసాగింపు టిల్లు స్క్వేర్ మీద ఏ స్థాయి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్వాలిటీ మీద టీమ్ ఎక్కువ శ్రద్ధ వహించడంతో ఈ ఏడాది విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. దర్శకుడు, హీరోయిన్ మార్పుతో మొదలై ముందు నుంచి వార్తల్లో నిలుస్తూ వచ్చిన టిల్లు స్క్వేర్ లో సిద్దు జోడిగా అనుపమ పరమేశ్వరన్ జత కూడినప్పటి నుంచి ప్రత్యేకమైన బజ్ తోడైంది. ఎట్టకేలకు సస్పెన్స్ కు చెక్ పెడుతూ రెండో టిల్లు ఎప్పుడు వస్తున్నాడో చెప్పేశారు
2024 ఫిబ్రవరి 9 టిల్లు స్క్వేర్ థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు అఫీషియల్ చేశారు. మొదటి భాగం 2022 ఫిబ్రవరి 12న వస్తే సరిగ్గా రెండేళ్లకు కొనసాగింపు రావడం విశేషం. నిజానికి ఇంత గ్యాప్ ముందే ప్లాన్ చేసుకున్నది కాకపోయినా ఆలా జరిగిపోయింది. మల్లిక్ రామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఎంటర్ టైనింగ్ క్రైమ్ డ్రామాలో ఈసారి చాలా విశేషాలు ఉండబోతున్నాయి. పేరుకి సీక్వెల్ అయినప్పటికీ హీరో క్యారెక్టరైజేషన్ మాత్రమే అలా ఉంచి మిగిలినదంతా కొత్త కథ రాసుకున్నారు. కొన్ని రషెస్ సంతృప్తికరంగా లేకపోవడంతో రీ షూట్ చేసి రాజీ పడకుండా బెస్ట్ కోసం కష్టపడుతున్నారు.
మొత్తానికి టిల్లు స్క్వేర్ తెలివైన డేట్ ని ఎంచుకుంది. ఆ సమయానికి సంక్రాంతి సినిమాల ఫైనల్ రన్ ముగిసిపోయి ఉంటుంది. వాటిలో ఎన్ని బ్లాక్ బస్టర్ అయినా నెలరోజులకు మించి రన్ ఉండదు కాబట్టి టిల్లు దిగే సమయానికి కావాల్సినన్ని థియేటర్లు అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరిని సహజంగా కొంచెం డ్రైగా భావిస్తారు కానీ ఇలాంటి మీడియం బడ్జెట్ సినిమాలకు అది మంచి ఛాయస్. గతంలో నాని నేను లోకల్ లాంటివి ఈ నెలలో వచ్చే సూపర్ హిట్లు సాధించాయి. డీజే టిల్లు కూడా భారీ వసూళ్లు రాబట్టింది. మంచి స్ట్రాటజీతో డేట్ ని సెట్ చేసుకున్న సిద్దు బాయ్ ఈసారి ఏం మేజిక్ చేస్తాడో.
This post was last modified on October 27, 2023 12:48 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…