Movie News

క్రేజీ కలయికతో సూర్య 43వ సినిమా

గజినీ నుంచి తమిళంలోనే కాదు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న సూర్యకు ఆ మధ్య కొన్ని వరస ఫ్లాపులు మార్కెట్ ని తగ్గించాయి కానీ ఆకాశం నీ హద్దురా, జై భీంలు ఓటటిలో వచ్చినా సరే అమోఘమైన విజయాలు సాధించి తన టేస్ట్ ని ప్రపంచానికి చాటి చెప్పాయి. శివ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీ కంగువా మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెట్రిమారన్ తో చేయబోతున్న వడివాసల్ మీద హైప్ అంతా ఇంతా కాదు. వీటి సంగతి పక్కనపెడితే తన 43వ సినిమాకి సూర్య చాలా క్రేజీ కాంబినేషన్ ని సెట్ చేసుకుని షాక్ ఇచ్చేశాడు.

ఆకాశం నీ హద్దురా దర్శకురాలు సుధా కొంగరతో మరోసారి చేతులు కలిపాడు. ఇది కాదు అసలు విశేషం. దుల్కర్ సల్మాన్ ఇంకో హీరోగా ఈ మల్టీస్టారర్ ని సూర్య తన బ్యానర్ మీదే నిర్మించబోతున్నాడు. పుష్ప విలన్ ఫహద్ ఫాసిల్ తో పాటు అతని నిజ జీవిత భార్య, అంటే సుందరానికి హీరోయిన్ నజ్రియా ఈ క్యాస్టింగ్ లో ఉన్నారు. ఆమెనే మెయిన్ హీరోయిన్. సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ కి ఇది నూరవ సినిమా. పీరియాడిక్ డ్రామాగా రూపొందబోయే ఈ కథ 70 దశకంలో జరిగిన యాంటీ హిందీ మూమెంట్ ఆధారంగా తీస్తున్నారని చెన్నై టాక్. ఇంకా పూర్తి వివరాలు తెలియాలి.

రెగ్యులర్ కమర్షియల్ కథలకు దూరంగా సూర్య చేస్తున్న ప్రయోగాలు అద్భుత ఫలితాలు ఇస్తున్నాయి. రొటీన్ దారిలో వెళ్లి చేసిన ఈటి లాంటివి ఇతర భాషల్లో ఫ్లాప్ కావడంతో అలాంటి వాటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. సుధా కొంగర సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి తీసుకెళ్ళబోతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే విక్రమ్ చేసిన రోలెక్స్ ని ఫుల్ లెన్త్ మూవీగా చూడాలన్న అభిమానుల డిమాండ్ నెరవేరే అవకాశం లేకపోలేదు. రజని 171, ఖైదీ 2 తర్వాత లోకేష్ కనగరాజ్ దాన్ని తీసే ఛాన్స్ ఉంది. ఆ మేరకు ఇటీవలే లియో ఇంటర్వ్యూలలో హింట్ ఇచ్చాడు కూడా. 

This post was last modified on October 26, 2023 7:22 pm

Share

Recent Posts

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

49 minutes ago

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

4 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

5 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

6 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

12 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

14 hours ago