కొన్నిసార్లు ఏది ఎలా వైరలవుతుందో ముందే ఊహించలేం. అది అనుకోకుండా సినిమా ప్రమోషన్ కు చాలా ఉపయోగపడుతుంది. విజయ్ దేవరకొండ రాబోయే సినిమా ఫ్యామిలీ స్టార్ టీజర్ లోని ఒక డైలాగ్ హఠాత్తుగా సోషల్ మీడియా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఆ వీడియో చివరిలో మగాడని నిరూపించుకోవడానికి ఐరన్ వంచాలా ఏంటి అనే మాటని వివిధ స్టార్ హీరోల ఫ్యాన్స్ బ్లాక్ బస్టర్ల సీన్లను లిప్ సింక్ చేసి వాటిని షేర్ చేస్తున్నారు. మహేష్ భరత్ అనే నేను, రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్, తారక్ అరవింద సమేత, ప్రభాస్ మిర్చి ఇలా అన్నిరకాలుగా వాడుకుని ఎంజాయ్ చేస్తున్నారు.
ఇది విజయ్ దృష్టికి కూడా వెళ్ళింది. ఇన్స్ టా స్టోరీలో ఏం జరుగుతోంది ఇంటర్నెట్ అంటూ ప్రశ్నిస్తూ ఐరన్ వంచాలా ఏంటి హాష్ టాగ్ ఒకటి పెట్టాడు. ఫ్యామిలీ స్టార్ మాస్ మసాలా సినిమా కాకపోయినా ఈ రకమైన పబ్లిసిటీ తెచ్చుకోవడం విశేషమే. ఖుషి ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో అభిమానుల ఆశలన్నీ ఫ్యామిలీ స్టార్ మీదే ఉన్నాయి. సర్కారు వారి పాట తర్వాత మళ్ళీ తన ట్రాక్ రికార్డుని ప్రూవ్ చేసుకోవాలనే టార్గెట్ తో ఉన్న దర్శకుడు పరశురామ్ మళ్ళీ గీత గోవిందం కాంబోని రిపీట్ చేస్తున్నాడు. టీజర్ వచ్చాక బిజినెస్ పరంగా క్రేజ్ ఎక్కువయ్యిందని ట్రేడ్ టాక్.
ఏదైతేనేం పుణ్యం పురుషార్థం దక్కడం ముఖ్యం. ఇప్పుడీ ఇరాన్ వంచాలా ఏంటితో అదేదో ఫ్రీగా పైసా ఖర్చు లేకుండా జరిగిపోతోంది. ముందు దీన్ని కొందరు నెగటివ్ గానే స్టార్ట్ చేశారని, విజయ్ దేవరకొండ తొలుత చూసి లైట్ తీసుకున్నా ఆ తర్వాత మెల్లగా ఇది పాజిటివ్ గా ట్రెండ్ అయిపోవడంతో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. మృణాళిని ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ లో విజయ్ పిల్లల తండ్రిగా కనిపిస్తున్నాడు. గుంటూరు కారం, ఈగల్, సైంధవ్, హనుమాన్, లాల్ సలామ్, అయలన్ తో పోటీ ఉన్నప్పటికీ నిర్మాత దిల్ రాజు ఎట్టి పరిస్థితుల్లో పండగని వదిలేది లేదంటున్నారు.
This post was last modified on October 26, 2023 6:46 pm
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…