Movie News

16 కోట్ల పాటని తేలిగ్గా తీసుకోవద్దు

కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన అభిమానులకు ఊరట కలిగిస్తూ గేమ్ ఛేంజర్ మొదటి ఆడియో సింగల్ ని దీపావళికి విడుదల చేస్తామని ఇటీవలే దసరా పండగ సందర్భంగా ఎస్విసి టీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సాంగ్ ఎలా ఉంటుందనే ఎగ్జైట్ మెంట్ అధిక శాతం చరణ్ ఫ్యాన్స్ లో లేదు. కారణం లీకైన టైంలోనే హై క్వాలిటీలో దాన్ని పూర్తిగా వినేశారు కాబట్టి. దిల్ రాజు బృందం వెంటనే మేల్కొని ఆన్ లైన్ లో ఆ పాట లేకుండా చూసుకుంది కానీ ఆలోపే స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లలో అది భద్రంగా సేవ్ అయిపోయింది. అసలు సవాల్ ఇప్పుడు రాబోతోంది.

ఆడియో ఎలా ఉందనే దానికంటే లిరికల్ వీడియోలో చూపించే విజువల్స్ ఎలా థ్రిల్ చేస్తాయనే దాని మీద ఫ్యాన్స్ ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ మల్టీ స్టారర్ కాబట్టి అందులో నాటు నాటు తప్ప ఇంకెక్కడా డాన్సు చేసే అవకాశం దొరకలేదు. హీరోయిన్ అలియా భట్ ఉన్నప్పటికీ తనతో లవ్ ట్రాక్ కానీ, కాలు కదిపి నృత్యం చేయడం కానీ ఏమి లేవు. ఆ కరువుని గేమ్ ఛేంజర్ తీరుస్తుందని వాళ్ళ ఆశ. కేవలం ఈ ఒక్క పాట చిత్రీకరణ కోసమే దర్శకుడు శంకర్ 16 కోట్లు ఖర్చుతో శంషాబాద్ దగ్గర సెట్లు వేయించి మరీ చిత్రీకరించారనే వార్త ఆల్రెడీ హాట్ టాపిక్ గా మారింది.

ఎంతలేదన్నా కనీసం ఓ రెండు మూడు స్టెప్పులు, కియారా అద్వానీతో చరణ్ ఆడిపాడిన విజువల్స్ గట్టిగా పడితే తప్ప ఈ జరగండి జరగండి అంత సులభంగా రీచ్ తెచ్చుకోలేదు. తమన్ ట్యూన్ తన రెగ్యులర్ బాణీలో అనిపించడంతో పాటు జాబిలమ్మ జాకెట్ వేసుకుని వచ్చెనండీ అంటూ లిరిక్స్ రాయించడం పట్ల లీకైనప్పుడు కామెంట్స్ వచ్చి పడ్డాయి. వాటికి సమాధానం ఇవ్వడంతో పాటు శంకర్ టేకింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలుసుకునేందుకు దీన్ని మొదటి ప్రామాణికంగా తీసుకోబోతున్నారు ప్రేక్షకులు, బయ్యర్లు. సో ఆషామాషీగా ఉంటే లాభం లేదు. నెవర్ బిఫోర్ అనిపించుకోవాల్సిందే. 

This post was last modified on October 26, 2023 11:53 am

Share

Recent Posts

మల్టీస్టారర్ మూవీకి మర్చిపోలేని అవమానం

కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…

9 minutes ago

ఆంధ్రా ముద్దుబిడ్డ అనంత్ అంబానీ

నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…

35 minutes ago

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

1 hour ago

వివేకా కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు

వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…

2 hours ago

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

2 hours ago

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

5 hours ago