ఈసారి దసరా సీజన్లో మూడు క్రేజీ సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో రిలీజ్ ముందు హైప్ అంతా అనువాద చిత్రమైన ‘లియో’కే ఉంది. ఓపెనింగ్స్‌లో కూడా ఆ సినిమానే డామినేట్ చేసింది. డివైడ్ టాక్‌ను కూడా తట్టుకుని తొలి వీకెండ్లో ఆ సినిమా మంచి వసూళ్లు సాధించింది. కానీ ‘లియో’కు క్రమంగా డివైడ్ టాక్ పెరగడంతో వసూళ్లు తగ్గుతూ వచ్చాయి. వీకెండ్ అయ్యాక సినిమా నిలబడలేకపోయింది. తొలి రెండు రోజుల్లో అంచనాలకు తగ్గట్లు వసూళ్లు రాబట్టని బాలయ్య సినిమా ‘భగవంత్ కేసరి’.. శనివారం నుంచి జోరు పెంచింది.
రోజు రోజుకూ వసూళ్లు పెరిగాయి. దసరా రోజుతో పాటు మరుసటి రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర ‘భగవంత్ కేసరి’ డామినేషన్ కనిపించింది. తొలి రోజు తర్వాత అత్యధిక వసూళ్లు వచ్చింది 5, 6 రోజుల్లోనే ఉంటున్నాయి ట్రేడ్ వర్గాలు. అంతిమంగా దసరా విన్నర్ ‘భగవంత్ కేసరి’ అని తేలడం.. దసరా సీజన్లో అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చే సినిమా ఇదే కావడంతో వసూళ్లకు ఢోకా లేకపోయింది. నిర్మాత దిల్ రాజు అన్నట్లు ఇది లాంగ్ రన్ ఫిలిం అనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
రెండో వీకెండ్‌ను కూడా ఈ సినిమా బాగా ఉపయోగించుకునేలా కనిపిస్తోంది. మరోవైపు డివైడ్ టాక్, డల్ ఓపెనింగ్స్‌తో మొదలైన రవితేజ సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’ వసూళ్లు కూడా నెమ్మదిగా పుంజుకోవడం విశేషం. ‘లియో’ డౌన్ అయిపోవడంతో ‘టైగర్’ ప్రేక్షకులకు సెకండ్ ఆప్షన్‌గా మారింది. రవితేజ అభిమానులు, మాస్ ప్రేక్షకులు సినిమాను బానే చూస్తున్నట్లు కనిపిస్తోంది. దసరా రోజు, తర్వాతి రోజు సినిమాకు ఉన్నంతలో మంచి వసూళ్లు వచ్చాయి. టాక్ చూసి మరీ భయపడినంత పరిస్థితి అయితే లేదు. ‘లియో’ది మాత్రం ఆరంభ శూరత్వమే అయింది.
This post was last modified on October 25, 2023 3:59 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…