ఒక స్టార్ హీరో సినిమా ఎనిమిదేళ్లు నిర్మాణంలో ఉండటం చిన్న విషయం కాదు. విక్రమ్ ధృవ నచ్చత్తిరమ్ నవంబర్ 24న విడుదల కాబోతోంది. ఎప్పుడో 2016లో షూటింగ్ మొదలుపెట్టిన దర్శకుడు గౌతమ్ మీనన్ సంవత్సరాల తరబడి దీన్ని చెక్కుతునే ఉన్నారు. ఆర్థిక కారణాల వల్ల పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆగిపోవడంతో కేవలం ఆ డబ్బుల కోసమే నటించడం మొదలు పెట్టానని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం సంచలనం రేపింది. సరే ఏదైతేనేం ఎట్టకేలకు గజేంద్ర మోక్షం దక్కి థియేటర్లలో అడుగు పెడుతోంది. తాజాగా తమిళ వెర్షన్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. రేపో ఎల్లుండో తెలుగు వస్తుంది.
కంటెంట్ చూస్తే ఆసక్తికరంగా ఉంది. తీవ్రవాదుల దుశ్చర్యలను ఆపేందుకు బేస్ మెంట్ పేరుతో పదకొండు మంది స్పెషల్ టీమ్ ని తయారు చేస్తాడో ఆఫీసర్. ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వీళ్ళ ఉనికి కానీ చర్యలు కానీ ఏవీ అభ్యంతర పెట్టడానికి ఉండనంత అధికారం ఇస్తారు. ఏ దేశమైన వెళ్లొచ్చు. ఏం కావాలన్నా చేయొచ్చు. కానీ ఖచ్చితంగా అది ఇండియా కోసమే అయ్యుండాలి. వీళ్ళలో చాలా అగ్రెసివ్ గా ఉండేది, దూసుకుపోయే మనస్తత్వం ఉన్నది జాన్ ఒక్కడే. అతనే చియాన్ విక్రమ్. మరి వీళ్ళందరూ పూనుకున్న సంకల్పం చివరికి నెరవేరిందా లేదా నెలాగి చూడాలి.
విజువల్స్ గట్రా చాలా రిచ్ గా ఉన్నాయి. ప్రొడక్షన్ వేల్యూస్ ఏ లోటు రానివ్వలేదనిపిస్తోంది. హీరోయిన్ గా పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ నటించడం విశేషం. హరీష్ జైరాజ్ సంగీతం సమకూర్చారు. పార్తీబన్, రాధికా, జైలర్ ఫేమ్ వినాయకన్ ఇలా పెద్ద క్యాస్టింగే ఉంది. స్టైలిష్ మేకింగ్ లో తనదంటూ ప్రత్యేక ముద్ర వేసిన గౌతమ్ మీనన్ తీసిన వెంకటేష్ ఘర్షణ, కమల్ హాసన్ రాఘవన్, అజిత్ ఎంత వాడు కానీలు మన ఆడియన్స్ లోనూ కల్ట్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాయి. ధృవ నచ్చత్తిరమ్ కూ ఆ ఛాన్స్ కనిపిస్తోంది. ఇది చాప్టర్ 1. ఇంకో భాగం వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
This post was last modified on October 25, 2023 4:16 am
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…