టాలీవుడ్ నటుడు నందు రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాడు. అతను బిగ్ బాస్ నాలుగో సీజన్లో పార్టిసిపెంటుగా వెళ్లబోతున్నట్లు కొంత కాలంగా ప్రచారం జరుగుతుండగా.. #BB అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి తన కొత్త ప్రాజెక్ట్ అంటూ సంకేతాలు ఇవ్వడంతో అతను బిగ్ బాస్‌లోకి వెళ్లడం ఖాయం అని అంతా ఓ నిర్ణయానికి వచ్చేశాడు. బిగ్ బాస్ నిబంధనలకు విరుద్ధంగా ఇలా ముందే తన బిగ్ బాస్ ఎంట్రీ గురించి సంకేతాలిచ్చాడేంటి అని అంతా ఆశ్చర్యపోయారు కూడా. కానీ తాను చెప్పింది బిగ్ బాస్ గురించి కాదని.. ఈ #BB వేరని తర్వాత అసలు విషయం చెప్పాడు నందు. అది అతడి కొత్త సినిమా కబురు అన్న సంగతి తాజాగా వెల్లడైంది.
బొమ్మ బ్లాక్‌బస్టర్ పేరుతో నందు కొత్తగా ఓ సినిమా చేయబోతున్నాడు. రాజ్ విరాట్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి, మనోహర్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నారు. ప్రశాంత్ విహారి సంగీత దర్శకుడు. ఇది విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం ప్రాంత నేపథ్యంలో సాగే సినిమా. ఒక ఆర్ట్ మాదిరి ఉన్న ప్రి లుక్ పోస్టర్ ద్వారా చాలా విషయాలు చెప్పాలని చూశారు. కానీ అందులో స్పష్టత లేకపోయింది. నందుకైతే ఇది స్పెషల్ మూవీనే అనిపిస్తోంది. దీని కోసం గడ్డం పెంచి లుక్ మార్చుకుని కొత్తగా తయారయ్యాడతను. మంచి టైటిల్, టీంతో వస్తున్న నందు.. ఈసారైనా సోలో హీరోగా ఆశించిన విజయాన్నందుకుంటాడేమో చూడాలి. చివరగా అతను హీరోగా నటించిన సవారి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది.
This post was last modified on August 27, 2020 1:51 am
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…