పండగ పూట ఉదయం చిరంజీవి దర్శకుడు వశిష్ట కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ తాలూకు కీలక అప్డేట్ ఉంటుందని యూవీ క్రియేషన్స్ తెగ ఊరిస్తూ ట్వీట్ పెట్టింది. ఇంకేముంది ఫ్యాన్స్ ఏవేవో ఊహించుకుని ఎదురు చూడటం మొదలుపెట్టారు. టైం చెప్పకుండా సస్పెన్స్ మైంటైన్ చేస్తూ అభిమానులు పావుగంటకోసారి సోషల్ మీడియా చెక్ చేసుకునేలా ప్రేరేపించింది. ఇంతా చేసి ఇచ్చిందేమయ్యా అంటే ఒక గ్రాఫిక్ తో చేసిన ఆయుధమున్న పోస్టర్ తో పాటు మెగా 157 కాస్తా నెంబర్ మారి 156 అయినట్టు చెప్పేశారు. అంటే భోళా శంకర్ తర్వాత సినిమా ఇదే.
దీని ప్రకారం చాలా స్పష్టంగా కళ్యాణ్ కృష్ణ సినిమాను పక్కపెట్టేసినట్టు క్లారిటీ ఇచ్చేశారు. నెలల తరబడి దాని మీద ఇతనితో పాటు రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ స్క్రిప్ట్ సిద్ధం చేశారు. మలయాళం బ్రో డాడీని స్ఫూర్తిగా తీసుకుని కీలక మార్పులతో సిద్ధూ జొన్నలగడ్డ లేదా శర్వానంద్ మరో పాత్రలో తీయబోతున్నారని ప్రచారం జరిగింది. ఈలోగా భోళా శంకర్ డిజాస్టర్ కావడంతో పాటు ఎప్పుడూ లేనన్ని తీవ్ర విమర్శలు మెగాస్టార్ ఎంపిక మీద రావడంతో ఒక్కసారిగా ఆత్మ పరిశీలన చేసుకున్న చిరు ఇక నో రీమేక్స్ నో కామెడీస్ అంటూ ఫాంటసీకి షిఫ్ట్ అయిపోయారు.
ఇదేదో నేరుగా చెప్పేస్తే అయిపోయేది కానీ పండగ పూట ఇంత నాన్చకుండా ఉండాల్సింది. ఇవాళ ఈ మెగా 156 పాట రికార్డింగ్ తో పూజా కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఎంఎం కీరవాణి స్వరపరిచిన ఒక సాంగ్ ని రికార్డు చేసినట్టుగా తెలిసింది. చాలా మంది ఆహ్వానితులే మధ్య ప్రోగ్రాం జరిగిందనే టాక్ వచ్చింది కానీ ఇంకా దాని తాలూకు ఫోటోలు, వీడియో బయటికి వదల్లేదు. ఏ నిమిషమైనా హఠాత్తుగా ఇవ్వొచ్చు. దీన్ని ముందుగా ఇచ్చి ఉంటే మెగా ఫ్యాన్స్ కొంత సంతృప్తి చెందేవాళ్ళు. మెగా 156 పూర్తవ్వడానికి వచ్చే ఏడాది పట్టేలా ఉంది. 2025 సంక్రాంతికి టార్గెట్ చేస్తున్నారనే టాక్ ఉంది ప్రస్తుతానికైతే ఇది ఖరారుగా చెప్పలేం.
This post was last modified on October 24, 2023 9:16 am
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…