స్టార్ హీరో వారసత్వం ముళ్లబాట లాంటిది. ఆస్తులను అనుభవించడం, పెంచడం సులభమే కానీ అభిమానుల అంచనాలను నిలబెట్టుకుంటూ మార్కెట్ ని పెద్ద స్థాయికి తీసుకెళ్లడం మాటల్లో చెప్పుకున్నంత సులభం కాదు. 2002లో ఈశ్వర్ తో తెరంగేట్రం చేసే నాటికి ప్రభాస్ రెబెల్ స్టార్ కృష్ణంరాజు గారి తమ్ముడి కొడుకుగా మాత్రమే ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. కుర్రాడిలో విషయం ఉందనే సంకేతం జనాలకు ఇచ్చాడు. రెండో సినిమా రాఘవేంద్ర డిజాస్టరైనా కథల ఎంపికలో తీసుకున్న జాగ్రత్త, కొత్త దర్శకుడిని నమ్మి చేసిన వర్షం మొదటి బ్లాక్ బస్టర్ ని నమోదు చేసింది.
అడవి రాముడు, చక్రంలు నిరాశపరిచినా రాజమౌళితో మొదటిసారి జట్టు కట్టిన ఛత్రపతి తనలోని రియల్ ఫైర్ ని ప్రపంచానికి పరిచయం చేసింది. పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజన్ ఫలితాలతో సంబంధం లేకుండా ప్రభాస్ లోని నటుడిని బాగా సానబెట్టాయి. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ ఘన విజయాలు తనలోని లవ్ బాయ్ ని యువతకు దగ్గర చేశాయి. ఓవర్ మాస్ తో రెబెల్ దెబ్బేసినా మిర్చితో తిరిగి తన సత్తా చాటాడు. ఇక బాహుబలి రెండు భాగాలూ ఇండియా దాటి ప్రభాస్ ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి తిరుగు లేని ప్యాన్ ఇండియా సింహాసనం మీద కూర్చోబెట్టాయి.
సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ లు ఫ్లాప్ అయ్యుండొచ్చు. కానీ వాటి ప్రభావం కించిత్ కూడా లేనంత ఎత్తులో ప్రభాస్ ఉన్నాడు. అందుకే సలార్ గురించి జ్వరం వచ్చినట్టు ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ తో కల్కి 2898 ఏడి రూపొందుతోంది. దర్శకుడు మారుతీ సినిమాని డైరెక్టర్ బ్రాండ్ తో సంబంధం లేకుండా ఎగబడి కొంటున్నారు. సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ షూటింగ్ మొదలుకాకుండానే ప్రకంపనలు రేపుతోంది. ఇదంతా చూస్తుంటే ప్రభాస్ కేవలం స్టార్ కాదు సలార్ టీజర్ లో టినూ ఆనంద్ చెప్పినట్టుగా టాలీవుడ్ బాక్సాఫీస్ డైనోసర్ అంటే కాదనేదెవరు.
This post was last modified on October 23, 2023 1:40 pm
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…
ఓ మూడేళ్ళ క్రితం దాకా టాలీవుడ్ టాప్ ప్లేస్ ఎంజాయ్ చేసిన పూజా హెగ్డేను వరస బ్లాక్ బస్టర్లు ఉక్కిరిబిక్కిరి…