నాని 31 కోసం దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావిచ్చేలా లేడు. అంటే సుందరానికి ఆశించిన ఫలితం అందుకోలేకపోవడం వెనుక నిడివితో పాటు తనవైపు నుంచి జరిగిన మిస్టేక్స్ ని గుర్తించి సన్నిహితుల సలహా మేరకు పక్కా ప్రణాళికతో స్క్రిప్ట్ నుంచి మొదలుపెట్టి క్యాస్టింగ్ దాకా అన్నీ పర్ఫెక్ట్ గా సెట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. హీరోయిన్ గా ప్రియాంకా అరుళ్ మోహన్ ని ఎంచుకోవడం తెలివైన ఎత్తుగడ. ఆల్రెడీ నానితో గ్యాంగ్ లీడర్ చేసింది కానీ అప్పటికి ఇప్పటికి తన ఇమేజ్ లో చాలా మార్పులొచ్చాయి. పవన్ కళ్యాణ్ సరసన ఓజిలో నటిస్తోంది.
మెయిన్ విలన్ గా ఏస్జె సూర్యని ఎంచుకోవడం తమిళ మార్కెట్ పరంగా చాలా ప్లస్ అవుతుంది. ఇతనుంటే చాలు సినిమా హిట్టనే సెంటిమెంట్ కోలీవుడ్ బయ్యర్లలో బాగా పాతుకుపోయింది. రెమ్యునరేషన్ ఎంత భారీగా ఇచ్చినా సరే తమిళ మార్కెట్ నుంచే దాన్ని రాబట్టుకోవచ్చు. సంగీత దర్శకుడి జెక్స్ బెజోయ్ ని తీసుకోవడం మ్యూజిక్ పరంగా ఫ్రెష్ అవుట్ ఫుట్ ని ఆశించవచ్చు. గత ఏడాది శర్వానంద్ ఒకే ఒక జీవితంకి ఇచ్చిన స్కోర్ ఆ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఉన్న మూడు నాలుగు ఆప్షన్లు చూడకుండా మలయాళీ వైపు చూడటం మంచి ఆలోచన.
ఇక సినిమాటోగ్రఫీ బాధ్యతను జి మురళికి ఇచ్చారు. ఈయన సూపర్ స్టార్ రజనీకాంత్ కాలా, కబాలికి పని చేసిన అనుభవముంది. కల్ట్ ఫాలోయింగ్ ఉన్న అందాల రాక్షసి మురళి మొదటి టాలీవుడ్ మూవీ. ఆ తర్వాత తమిళంలోకి వెళ్లిపోయారు. ఆర్య సర్పట్ట పరంబరయ్ తో పాటు ఇటీవలే విజయ్ దేవరకొండ ఖుషికి పని చేసింది కూడా ఈ మురళినే. సో క్వాలిటీ పరంగా ఎక్కడా రాజీ లేకుండా వెళ్తున్న వివేక్ ఆత్రేయ నిర్మాత డివివి దానయ్య అండ దొరకడంతో కాంప్రోమైజ్ అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు. సరిపోదా శనివారం టైటిల్ ప్రచారంలో ఉంది. దసరాకి అఫీషియల్ గా రివీల్ చేయబోతున్నారు.
This post was last modified on October 23, 2023 2:02 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…