తమిళనాడు బాక్సాఫీస్ వద్ద టాక్ తో సంబంధం లేకుండా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తున్న లియో దసరా పండగ పూర్తయ్యే వరకు నెమ్మదించే సూచనలు లేవు. తెలుగులో భగవంత్ కేసరితో పెద్ద పోటీ ఉన్నప్పటికీ భారీ కలెక్షన్లు రాబట్టడం విశేషం. అలా అని యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు. అయినా సరే ఇంత స్పందన రావడం మాములు విషయం కాదు. ఇక ఈ సినిమాలో పాత్రలు వాటి మధ్య సంబంధాలు పక్కనపెడితే విజయ్ ఇంట్రో తర్వాత వచ్చే హైనా జంతువు ఎపిసోడ్ మీద విపరీతమైన హైప్ నెలకొంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ మిస్ అవ్వొద్దని పదే పదే చెబుతూ వచ్చాడు.
ఊరి మీద పడి అందరినీ కరుస్తూ ఉంటే విజయ్ దాన్ని కంట్రోల్ చేసి అటవీ అధికారులకు అప్పగిస్తాడు. తర్వాత ఓ రోజు ఫ్యామిలీతో కలిసి చూసేందుకు వెళ్తాడు. దానికో పేరు పెడితే బాగుంటుందని సుబ్రహ్మణ్యం అని నామకరణం చేస్తాడు. అజిత్ ఫ్యాన్స్ ఈ విషయంగానే కోపంగా ఉన్నారట. ఎందుకంటే వాళ్ళ హీరో పూర్తి పేరు అజిత్ కుమార్ సుబ్రమణియన్. ఇద్దరి హీరోల అభిమానుల మధ్య ఎన్నో ఏళ్ళగా పచ్చగడ్డి భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. అజిత్ తన ఫ్యాన్స్ అసోసియేషన్లను అధికారికంగా రద్దు చేసినా వాళ్ళు మాత్రం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.
కావాలనే హైనాకు ఆ పేరు పెట్టారని వాళ్ళ కంప్లయింట్. ఇది కావాలని చేసింది కాకపోవచ్చు. అయినా సరే ఉద్దేశాలు అలా ఆపాదించబడుతున్నాయి. లోకేష్ తనకు ఎప్పటి నుంచో అజిత్ తో సినిమా చేయాలనుందనే కోరిక వెలిబుచ్చాడు. అలాంటప్పుడు అనవసరంగా కవ్వించే పనులు చేయడు. ఆన్ లైన్ లో ఇలా ఆపాదించుకుంటున్నారు తప్ప అందులో అంత మీనింగ్ లేదంటున్నారు కొందరు. ఎంత కాకతాళీయమైనా సరే అజిత్ చివరి పేరుని దానికి పెట్టడం వెనుక ఏదో ప్రత్యేక కారణం ఉందని మరికొందరి వాదన. ఏదేమైనా ఫ్యాన్స్ విశ్లేషణలు బహు విచిత్రంగా ఉంటాయి.
This post was last modified on October 22, 2023 2:52 pm
టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…