ఊహించని విధంగా అంచనాలకు మించి 2023 బ్లాక్ బస్టర్స్ లో చోటు సంపాదించుకున్న బేబీ సినిమా టీమ్ మరోసారి చేతులు కలిపింది. హీరో హీరోయిన్ కూడా రిపీట్ అవుతున్నారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా సాయి రాజేష్ కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలతో ఈ కలయిక మరోసారి సాధ్యపడుతోంది. అయితే దర్శకుడు మారడం బిగ్ ఛేంజ్. ఆ బాధ్యతను రవి నంబూరికి అప్పగించారు. సంగీతం విజయ్ బుల్గానిన్ అందిస్తుండగా నిర్మాత ఎస్కెఎన్ తో పాటు మరో ముగ్గురు భాగస్వాములు ఉండబోతున్నారు. డైరెక్టర్ కి ఇది డెబ్యూ మూవీ కావడం గమనించాల్సిన విషయం.
బేబీ జోడి రిపీట్ అంటే సహజంగానే బజ్ వచ్చేస్తుంది. ముఖ్యంగా యూత్ లో క్రేజ్ మాములుగా ఉండదు. బేబీ సుమారు వంద కోట్ల దాకా గ్రాస్ సాధించిన విషయం తెలిసిందే. దర్శకుడు సాయి రాజేష్ కి తొలి విజయమే గ్రాండ్ గా దక్కింది. అయితే రెండో సినిమాని డైరెక్ట్ చేయడానికి ముందు తను రాసిన కథనే ప్రొడ్యూసర్లలో ఒకడిగా మారి ప్రాజెక్టుని డిజైన్ చేయడం విశేషం. అయితే ఇది బేబీ లాగా లవ్ ఫెయిల్యూర్, బాధతో ఉండదని ఇన్ సైడ్ టాక్. సముద్రపు ఒడ్డున వైష్ణవికి ఆనంద్ లవ్ ప్రపోజ్ చేస్తూ దగ్గర తీసుకునే సీన్ నే ఫస్ట్ లుక్ పోస్టర్ గా రిలీజ్ చేసి లవ్ స్టోరీ అనే హింట్ ఇచ్చారు.
మొత్తం నాలుగు సినిమాలను ఎస్కెఎన్ ప్లాన్ చేసుకోగా వాటిలో ఇది మొదటిది. మరో మూడు అనౌన్స్ మెంట్స్ త్వరలో రాబోతున్నాయి. కంటెంట్ ఉంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని బేబీ ఋజువు చేసింది. అంతకు ముందు సాయిరాజేష్ రచన చేసిన కలర్ ఫోటో జాతీయ అవార్డు సాధించిన సంగతి తెలిసిందే. బరువైన ఎమోషన్లతో ప్రేమకథలను సున్నితంగా ఆవిష్కరిస్తారని పేరు తెచ్చుకున్న ఈ బృందం నుంచి మరో ఎమోషనల్ మూవీ ఆశించవచ్చు. 2024 వేసవి విడుదలని ప్రకటించేశారు. సో మొత్తం పక్కా ప్రణాళికతోనే షూటింగ్ గట్రా పూర్తి చేయబోతున్నారు.
This post was last modified on October 20, 2023 10:50 pm
సీనియర్ నటుడు సుమంత్ ప్రధాన పాత్రలో వచ్చిన కొత్త సినిమా మహేంద్రగిరి వారాహి మీద విడుదలకు ముందు మంచి అంచనాలే…
తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…
హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…