నిన్న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి ఊపుమీదున్న భగవంత్ కేసరి విజయాన్ని టీమ్ ఆస్వాదిస్తోంది. ఈ సందర్భంగా మీడియాతో సక్సెస్ మీట్ పెట్టారు. శ్రీలీల పాత్రకు డాన్సులు, గ్లామర్ టచ్ లేదని కొందరు ప్రస్తావించడాన్ని వివరించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఒక ఫోబియాతో బాధ పడుతున్న అమ్మాయిని ఆర్మీలో చేర్పించేందుకు తండ్రి లాంటి వాడు కష్టపడితే అందులో కూడా పాటలు కావాలని కోరుకునే వాళ్ళ మైండ్ సెట్ ఏంటో వాళ్ళకే తెలియాలని చురక వేశాడు. ఎవరి గురించో పేరు ప్రస్తావించకపోయినా కౌంటర్ అయితే సూటిగానే తగిలేలా పేలింది.
ఎవరి నుంచి లైంగికంగా ఎలాంటి అసౌకర్యం కలిగిన ఆడపిల్లలు అమ్మకే చెప్పాలనే దాని గురించి అనిల్ వివరణ ఇచ్చాడు. కొన్ని ఇబ్బందులు, సమస్యలు తండ్రికి సైతం చెప్పుకోలేనివి ఉంటాయని, అవి సహజంగానే అమ్మాయిలకు వచ్చే లక్షణమని, అంతే తప్ప అక్కడ లోతుగా శల్య పరీక్ష చేయాల్సిన అవసరం లేదని సున్నితంగా తేల్చేశాడు. ఇందులో పాయింట్ ఉంది. ఎందుకంటే తల్లితో మాత్రమే పంచుకునే విషయాలు టీనేజ్ పిల్లలకు బోలెడుంటాయి. కన్నవాడే అయినా నాన్నతో అన్నీ షేర్ చేసుకోలేరు. అందుకే బాలయ్య స్పీచ్ ద్వారా చక్కగా వివరించారు.
భగవంత్ కేసరిలో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నది బాలకృష్ణ, శ్రీలీల మధ్య ఉన్న బాండింగే. వీకెండ్ వసూళ్లను ఈ వర్గమే నిర్దేశించబోతోంది. త్వరలో బహిరంగ వేడుక రూపంలో చేసే సక్సెస్ మీట్ కి బాలయ్యతో సహా టీమ్ మొత్తం హాజరవుతుందని, అభిమానులు కూడా వస్తారని అనిల్ రావిపూడి చెప్పేశారు. తేదీ తదితర వివరాలు చెప్పలేదు కానీ దసరా లోపే నిర్వహించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అపోజిషన్ లో ఉన్న రెండు సినిమాల టాక్ డివైడ్ గా ఉండటం కేసరికి కలిసి వస్తున్న అంశం. ఇంకో వారం స్ట్రాంగ్ రన్ కొనసాగించగలిగితే భారీ లాభాలు గ్యారెంటీ.
This post was last modified on October 20, 2023 10:46 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…