Movie News

వేరే దారి లేదు హనుమాన్

సంక్రాంతి రేసులోకి ఒకదాని తర్వాత ఒక సినిమా వస్తూనే ఉన్నాయి. ఈ వరద ఎంతకీ ఆగట్లేదు. ఇప్పటికే అరడజను సినిమాలు సంక్రాంతి డేట్ ఫిక్స్ చేసుకోవడం విశేషం. కానీ అక్కడ మూడు సినిమాలకు మించి స్కోప్ తక్కువే. ఈ ఏడాది సంక్రాంతికి రెండు తెలుగు చిత్రాలకు తోడుగా.. రెండు అనువాద చిత్రాలకు థియేటర్లు సర్దుబాటు చేయడమే కష్టమైంది. మామూలుగా అయితే రెండు పెద్ద సినిమాలను బాగా ఆడించుకోవడానికి సంక్రాంతికి స్కోప్ ఉంటుంది.

కష్టమ్మీద ఒకో సినిమాను ఇరికించవచ్చు. అంతకుమించి సినిమాలు వస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందో 2016 సంక్రాంతి టైంలో చూశాం. బాలయ్య సినిమా ‘డిక్టేటర్’ ఆ పోటీలో దెబ్బ తింది. మంచి టాక్ తెచ్చుకున్న ‘నాన్నకు ప్రేమతో’కు కూడా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ పంట పండించుకుంటే.. ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ కూడా మంచి ఫలితాన్నందుకుంది. అంత పోటీలో వచ్చినపుడు టాక్ బాలేని సినిమాకు గట్టి దెబ్బ తగులుతుంది.

ఈ విషయం తెలిసి కూడా ఆల్రెడీ ‘గుంటూరు కారం’తో పాటు ‘ఈగల్’, ‘సైంధవ్’, ‘నా సామిరంగా’; ‘హనుమాన్’ సినిమాలు సంక్రాంతి రిలీజ్ ఖాయం చేసుకున్నాయి. కొత్తగా ‘ఫ్యామిలీ స్టార్’ కూడా రేసులోకి వచ్చింది. వీటిలో ‘గుంటూరు కారం’ కచ్చితంగా సంక్రాంతికే వచ్చేలా ఉంది. దాని విషయంలో డౌట్ లేదు. ‘సైంధవ్’, ‘ఫ్యామిలీ స్టార్’ కూడా పక్కా అంటే పక్కా అన్నట్లున్నాయి. వాటికి సురేష్ బాబు, దిల్ రాజుల అండ ఉంది. థియేటర్ల సమస్య లేదు. పీపుల్స్ మీడియా వాళ్లు ‘ఈగల్’ విషయంలో పట్టుదలతో ఉన్నారు.

కానీ ఈ సినిమా గురించి ఈ మధ్య అప్‌డేట్ ఏమీ లేదు. ఈ సినిమా సంక్రాంతికి రావడం కొంచెం డౌట్‌గానే ఉంది. ఇది వచ్చేట్లయితే అక్కడితో సంక్రాంతి బెర్తులు క్లోజ్ అయినట్లే. నా సామిరంగా షూట్ పూర్తవడాన్ని బట్టి రేసులో ఉంటుంది. లేదా ఆ సినిమా కూడా అనుమానమే. ఇక ‘హనుమాన్’ విషయానికి వస్తే.. ఇంత పోటీ మధ్య ఆ చిన్న సినిమాకు థియేటర్లు దక్కడం సందేహంగానే ఉంది. సినిమా రెడీ అయినా సరే.. థియేటర్లు దక్కించుకోవడం దానికి సవాలే. పోటీ కూడా సమస్యగా మారుతుంది. కాబట్టి ‘హనుమాన్’కు డేట్ మార్చక తప్పేలా లేదు.

This post was last modified on October 19, 2023 9:00 pm

Share

Recent Posts

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

1 hour ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

1 hour ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

3 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

4 hours ago

టీడీపీకి 58 కోట్లు.. వైసీపీకి 24 కోట్లు.. బీఆర్ ఎస్‌కు 16 కోట్లు..

భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…

5 hours ago

కార్తీ రేంజు ఇంత పడిపోయిందా

యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…

7 hours ago