Movie News

అరుదైన బాక్సాఫీస్ బొనాంజా చూస్తామా?

ఒక వీకెండ్లో రెండు మూడు సినిమాలు రిలీజైతే.. ఆ సినిమాలన్నీ పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకున్న సందర్భాలు చాలా అరుదనే చెప్పాలి. ఐతే ఈ వీకెండ్లో రాబోయే సినిమాలు మాత్రం చాలా ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నాయి. దేని స్థాయిలో అవి మంచి బజ్ తెచ్చుకున్నాయి. దసరా సెలవుల సీజన్ కావడంతో మూడు సినిమాలకూ మంచి టాక్ వస్తే అన్నీ బాగా ఆడేందుకు స్కోప్ కూడా ఉంది. ఇప్పుడు కావాల్సిందల్లా మంచి టాకే. దసరా సినిమాలు మూడూ సక్సెస్ అవుతాయని ఆశలు పెట్టుకోవడానికి కారణాలు లేకపోలేదు. 

ముందుగా బాలకృష్ణ సినిమా ‘భగవంత్ కేసరి’ విషయానికి వస్తే.. ఈ నందమూరి హీరో మూస మాస్ సినిమాల ఫార్మాట్ వదిలి కొంచెం డిఫరెంటు‌గా ఏదో ట్రై చేశాడని ఈ సినిమా ప్రోమోలు చూస్తే అర్థమవుతోంది. దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ముందు నుంచి ‘బియాండ్ ఎక్స్‌పెక్టేషన్స్’ అనే చెబుతున్నాడు ఈ సినిమా గురించి. ఈ మధ్యే వచ్చిన ట్రైలర్ చాలా ఇంప్రెసివ్‌గా అనిపించింది. అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డు గురించి తెలిసిందే. ఒక్క ‘ఎఫ్-3’ మాత్రమే ఓ మోస్తరుగా ఆడింది. మిగతావన్నీ పెద్ద హిట్లే. అతడి సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది.

ఇక ‘టైగర్ నాగేశ్వరరావు’ అయితే దసరా సినిమాల్లో అత్యంత బలమైన కంటెంట్ ఉన్న సినిమాలా కనిపిస్తోంది. ఒకప్పుడు ఆంధ్రాను గడగడలాడించిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. ఆ కథను లార్జర్ దన్ లైఫ్ స్టయిల్లో డీల్ చేసినట్లున్నారు. ట్రైలర్ చూసి అందరూ ఆశ్చర్యపోయే రేంజిలో ఔట్ పుట్ ఇచ్చాడు దర్శకుడు వంశీ ఆకెళ్ల. రవితేజ కూడా టైగర్ పాత్రలో అదరగొట్టినట్లే ఉన్నాడు. సినిమాకు మరీ హైప్ లేదు కానీ.. కంటెంట్‌తో ఈ సినిమా కొడుతుందనే నమ్మకం కలుగుతోంది.

ఇక తమిళ అనువాద చిత్రం ‘లియో’కు హైప్ మామూలుగా లేదు. లోకేష్ కనకరాజ్ అంటే మన ఆడియన్స్ ఊగిపోతున్నారు. అతడికి అనిరుధ్ తోడైతే ఆ కిక్కే వేరుగా ఉంటుందని ‘విక్రమ్’తో అర్థమైంది. విజయ్‌కి తెలుగులో మరీ ఫాలోయింగ్ ఏమీ లేదు కానీ.. లోకేష్, అనిరుధ్‌ల వల్ల ‘లియో’ కోసం మన ఆడియన్స్ ఎగబడే పరిస్థితి ఉంది. లోకేష్ సినిమా అంటే పక్కా బ్లాక్ బస్టర్ అనే ఫీలింగ్‌లో ఉన్నారు ప్రేక్షకులు. మరి ఈ మూడు చిత్రాలూ అంచనాలను అందుకుని, మంచి టాక్ తెచ్చుకుంటే అరుదైన బాక్సాఫీస్ బొనాంజాను చూడబోతున్నట్లే.

This post was last modified on October 19, 2023 11:55 am

Share

Recent Posts

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

10 minutes ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

37 minutes ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

47 minutes ago

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

3 hours ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

4 hours ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

4 hours ago