పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మళ్లీ పెళ్లి చేసుకుందా లేదా అనే విషయంలో అయోమయం నెలకొంది. కొన్నేళ్ల కిందట ఆమె ఒక వ్యక్తితో నిశ్చితార్థం చేసుకోవడం.. ఆ వ్యక్తి ఫొటో బయటపెట్టకుండా, ఈ విషయం మాత్రం అధికారికంగా ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. ఐతే నిశ్చితార్థం తర్వాత ఏ అప్‌డేట్ లేదు. రేణు సైలెంటుగా పెళ్లి చేసుకుందా.. లేక ఆ పెళ్లిని రద్దు చేసుకుందా అన్నది స్పష్టత లేకపోయింది.
రేణు తర్వాత ఎప్పుడూ దీని గురించి మాట్లాడింది లేదు. దీనిపై క్లారిటీ ఇచ్చే వ్యక్తులు కూడా ఎవరూ లేరు. ఐతే ఎట్టకేలకు ఒక ఇంటర్వ్యూలో తన రెండో పెళ్లి గురించి రేణు స్వయంగా క్లారిటీ ఇచ్చింది. ఇంతకుముందు నిశ్చితార్థం చేసుకున్న వ్యక్తితో పెళ్లిని రద్దు చేసుకున్నట్లు ఆమె వెల్లడించింది.
తనకు రెండో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ముందు నుంచి ఉందని, ఇప్పటికీ ఉందని.. ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనిపించి నిశ్చితార్థం చేసుకున్నానని ఆమె తెలిపింది. కానీ అప్పటికి తన కూతురు ఆద్యకు ఏడేళ్ల వయసేనని.. ఆ సమయంలో తాను పెళ్లి చేసుకుంటే తనకు చాలినంత సమయం కేటాయించలేనని అనిపించిందని.. ఈ విషయంలో మథన పడి తాను రెండో పెళ్లి రద్దు చేసుకున్నానని రేణు తెలిపింది.
ఆద్యకు సరైన వయసు వచ్చినపుడు తాను తోడు గురించి ఆలోచించాలని భావించానని ఆమె చెప్పింది. ఇంకో రెండేళ్ల తర్వాత తాను పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నట్లు రేణు తెలిపింది. మొత్తానికి కూతురి కోసమే నిశ్చితార్థం తర్వాత రెండో పెళ్లిని క్యాన్సిల్ చేసుకుందంటే రేణు గొప్ప మనిషే. కాగా పవన్ కళ్యాణ్‌తో విడాకులకు దారితీసిన కారణాల గురించి అడిగితే దానిపై ఆమె మాట్లాడనని తేల్చి చెప్పింది. సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల మీద చెత్త థంబ్ నైల్స్ పెట్టొద్దని ఆమె హితవు పలికింది.
This post was last modified on October 19, 2023 10:16 am
ఇప్పుడు టాలీవుడ్లో చాలామంది యంగ్ హీరోలది ఒకటే మాట. తమ సినిమాలను ఎవరో పనిగట్టుకుని టార్గెట్ చేస్తున్నారని. తమ చుట్టూ…
థాయ్‌లాండ్ రాణి సుతిదా ఇప్పుడు యుద్ధ విమానం నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. 48 ఏళ్ల వయసులో గ్రిపెన్ ఫైటర్ జెట్‌ను…
కడుపున పుట్టిన బిడ్డకు వైద్యం చేయించేందుకు డబ్బులు లేక ఓ తల్లి చేసిన పని కలచివేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆరేళ్ల…
యెమెన్ అంతర్గత యుద్ధం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ దళాలకు సౌదీ అరేబియా మద్దతునిస్తోంది. మరోవైపు, యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు…
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…
తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…