పక్క బాషల దర్శకులు మన మార్కెట్ లో ఆధిపత్యం చూపించడం, తమకంటూ ఫాలోయింగ్ ఏర్పరుచుకోవడం కొత్తేమి కాదు. బాలచందర్, మణిరత్నం హయాం నుంచి వస్తున్నదే. తాజాగా ఏపీ తెలంగాణలో లియోకు జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తున్న అభిమానులు శంకర్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి మేనియా చూపిస్తున్న డైరెక్టర్ లోకేష్ కనగరాజేనని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. విజయ్ కు ఎప్పుడూ మొదటి రోజే అన్ని చోట్ల హౌస్ ఫుల్స్ అయ్యేంత రేంజ్ మన దగ్గర లేదు. కానీ లియో దానికి మినహాయింపుగా నిలిచి ఏకంగా బాలయ్య, రవితేజలకే గట్టి పోటీ విసిరే స్థాయికి చేరుకుంది.
బాగానే ఉంది కానీ లోకేష్ ని మరీ శంకర్ తో పోల్చడమంటేనే అతిశయోక్తి అనిపించకమానదు. ఎందుకంటే శంకర్ ఎప్పుడు స్టైల్ కంటే సబ్ స్టాన్స్ మీదే ఆధారపడ్డారు. జెంటిల్ మెన్ లో అప్పడాలు అమ్మే వాడిని దొంగగా చూపించి దాని వెనుక విద్య వ్యవస్థలోని లోపాలను ఎండగట్టారు. భారతీయుడులో డెబ్భై ఏళ్ళ ముసలివాడిని హీరోగా చేసి లంచం తీసుకున్న కొడుకును హత్య చేసినా ఒప్పుకునేలా చేశారు. ఒకే ఒక్కడులో సిఎం పదవికి ఉండాల్సిన లక్షణాలను చూపించారు. ఇవన్నీ సామజిక బాధ్యతతో తీసిన కమర్షియల్ సినిమాలు. పాటలు, ఫైట్లు అన్నీ ఉంటూనే అంతర్లీనంగా మెసేజ్ ఇచ్చాయి.
లోకేష్ కనగరాజ్ రూటు వేరు. తనవన్నీ యాక్షన్ గ్రాండియర్లు. హీరోయిజంని ఎలా చూపిస్తే మాస్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ వస్తాయో సరిగ్గా అలాంటి కథలు రాసుకుంటాడు తప్పించి ఏదో సందేశం ఇవ్వాలన్న తపన ఉండదు. అది అతని స్టైల్. ఒక ఇంటర్వ్యూలో ఒప్పుకున్నాడు కూడా. ఇంత అనుభవానికే ఏకంగా శంకర్ తో పోల్చడమో లేదా దాటేశాడని చెప్పడమో కరెక్ట్ కాదు. వసూళ్లు ఒక డైరెక్టర్ ప్రతిభకు కొలమానం కాదు. అలా అయితే కెజిఎఫ్ తో పన్నెండు వందల కోట్ల సినిమాని ఇచ్చిన ప్రశాంత్ నీల్ ని రాజమౌళిని మించి అని తీర్పు ఇవ్వలేం కదా. శంకర్ లోకేష్ విషయంలోనూ అంతే.
This post was last modified on October 18, 2023 10:25 pm
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…
నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉండే వారి నుంచి వచ్చే మాటల వెనుక ఊహకు అందని లెక్కలు.. సమీకరణాలు ఉంటాయి. అందునా..…