చాలా గ్యాప్ తర్వాత హాస్య నటుడు సంపూర్ణేష్ బాబు హీరోగా ఓ సినిమా వస్తోంది. గత పది రోజులుగా కొన్ని ఎంపిక చేసిన ఊళ్లలో ప్రీమియర్లు కూడా వేసుకున్న మార్టిన్ లూథర్ కింగ్ జనాలకు మెల్లగా రీచ్ అవుతోంది. అక్టోబర్ 27 థియేటర్లలో అడుగు పెట్టబోతున్న ఈ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ తమిళ సూపర్ హిట్ మండేలాకు అఫీషియల్ రీమేక్. ఒరిజినల్ వెర్షన్ చూసిన వాళ్లకు ఇదెంత మంచి చిత్రమో అవగాహన ఉంటుంది. అక్కడ యోగిబాబు చేసిన పాత్ర ఇక్కడ సంపూ పోషించాడు. ఇవాళ రిలీజ్ చేసిన ట్రైలర్ తో కథా కమామీషు ఏంటో వివరంగా చెప్పే ప్రయత్నం చేశారు.
ఊరి బయట కుట్టుమిషన్ పెట్టుకుని బ్రతుకీడుస్తున్న స్మైలీ(సంపూర్ణేష్ బాబు) అనాథ. అసలు పేరు కూడా తెలియదు. ఇతని అమాయకత్వం చూసిన ఓ ప్రభుత్వ ఉద్యోగి(శరణ్య ప్రదీప్) మార్టిన్ లూథర్ కింగ్ అని నామకరణం చేస్తుంది. సర్పంచ్ పదవి కోసం స్థానిక కుల నాయకులు(నరేష్ – వెంకటేష్ మహా)ఇద్దరు పోటీ పడుతూ ఓటర్లను ఆకర్షించడం కోసం డబ్బులు, కానుకలు పంచుతారు. తీరా ఒక్క ఓటు గెలుపుని శాశిస్తుందని గుర్తించి అది మార్టిన్ దేనేని అతని వెంటపడి ప్రసన్నం చేసుకోవడం మొదలుపెడతారు. ముందు ప్రలోభ పడి తర్వాత తప్పు తెలుసుకుంటాడు కింగ్.
పూజా కొల్లూరు దర్శకత్వంలో రూపొందిన ఈ విలేజ్ డ్రామాకు స్క్రీన్ ప్లే, మాటలు వెంకటేష్ మహా సమకూర్చారు. తక్కువ బడ్జెట్ లో మొత్తం పల్లెటూరి వాతావరణంలో ఇప్పటి రాజకీయ పోకడలను ఎండగట్టే విధంగా సాగింది. స్మరన్ సాయి సంగీతం సమకూర్చగా, దీపక్ ఛాయాగ్రహణం బాధ్యతలు నిర్వర్తించారు. కామెడీ,సెటైర్లు, ఎమోషన్లు, సెంటిమెంట్లు అన్ని ఉన్నట్టే కనిపిస్తున్నాయి. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో కాకుండా నిజాయితీగా తీసుకున్న పాయింట్ తో రూపొందిన మార్టిన్ లూథర్ కింగ్ దసరా బాక్సాఫీస్ సందడి ముగిశాక వస్తోంది. చిన్న సినిమాగా పెద్ద వండర్ ఏమైనా చేస్తుందేమో చూడాలి
This post was last modified on October 18, 2023 7:08 pm
ఏడేళ్ల క్రితం ఒక చిన్న సీన్ ఆమెకు ఓవర్ నైట్ పాపులారిటీ తెచ్చి పెట్టింది. కుర్రాడిని చూస్తూ కన్నుగీటుతున్న సన్నివేశం…
సజ్జల రామకృష్ణారెడ్డి... అటు సొంత పార్టీ వైైసీపీతో పాటు ఇటు ఆ పార్టీ వైరి వర్గాల్లోనూ నిత్యం నానుతూ ఉండే పేరిది.…
ఈ వారం విడుదల కాబోతున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతిలో క్లైమాక్స్ గురించి టీమ్ పదే పదే హైలైట్ చేస్తూ చెప్పడం…
నిన్న ఉప్పల్ స్టేడియంలో జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ మ్యాచ్ చూసి క్రికెట్ అభిమానులు ఊగిపోయారు. ముఖ్యంగా అభిషేక్…
గత ఏడాది విశ్వంభర టీజర్ కొచ్చిన నెగటివ్ రెస్పాన్స్ ఏ స్థాయిదో మళ్ళీ గుర్తు చేయనక్కర్లేదు. అందుకే నెలల తరబడి…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో హిట్ 3 ది థర్డ్ కేస్ విడుదల కానుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2…