Movie News

తమన్, దేవి తప్ప ఎవరూ కనిపించరా?

తెలుగులో ఏ పెద్ద సినిమా మొదలువుతున్నా.. సంగీత దర్శకుడిగా పరిగణించే పేర్లు తమన్, దేవిశ్రీ ప్రసాద్‌లవే. ఒకప్పుడు దేవి నంబర్ వన్ ప్లేస్‌లో ఉంటే.. తమన్ రెండో స్థానంలో ఉండేవాడు. కానీ గత కొన్నేళ్లుగా తమన్ స్టార్ హీరోలు, డైరెక్టర్లకు ఫస్ట్ ప్రయారిటీగా మారాడు. దేవి ప్రాధాన్యం కొంచెం తగ్గింది. అలా అని అతడికి డిమాండ్ లేదా అంటే అలాంటిదేమీ లేదు. కానీ దర్శక నిర్మాతలు, హీరోలు ఎప్పుడూ వీరి చుట్టూనే తిరగడం ఆశ్చర్యం కలిగించే విషయం.

తమిళంలో, హిందీలో సంగీత దర్శకుల విషయంలో చాలా ఆప్షన్లు కనిపిస్తాయి. తమిళంలో సంగతే తీసుకుంటే అక్కడ అనిరుధ్ రవిచందర్‌దే డామినేషన్ అయినప్పటికీ.. ఎ.ఆర్.రెహమాన్, యువన్ శంకర్ రాజా, సంతోష్ నారాయణన్, జి.వి.ప్రకాష్ కుమార్, డి.ఇమాన్.. ఇలా చాలామంది సంగీత దర్శకులు  పెద్ద సినిమాలను వాళ్లు పంచుకుంటూ ఉంటారు. కానీ మన దగ్గర అలాంటి వెరైటీ కనిపించదు. రాజమౌళి సినిమాలకు కీరవాణి ఫిక్స్. మిగతా పెద్ద సినిమాలకు తమన్, దేవిశ్రీల మధ్యే పోటీ ఉంటుంది.

ఎంత పారితోషకమైనా ఇచ్చి అనిరుధ్‌ను తెచ్చుకుందామని చూస్తారే తప్ప.. వేరే సంగీత దర్శకుల వైపు చూడట్లేదు. మధ్యలో అనూప్ రూబెన్స్, మిక్కీ జే మేయర్ లాంటి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లు కొంచెం రైజ్ అయినట్లు కనిపించారు కానీ.. వాళ్లు మాస్ సినిమాలకు సరిపోయే మ్యూజిక్ ఇవ్వలేరని ఒక ముద్ర వేసి పక్కన పెట్టేశారు.  ఐతే ఇప్పుడు భీమ్స్ సిసిరోలియో కొంచెం ఆశాజనకంగా కనిపిస్తున్నాడు. అతను ధమాకా, బలగం, మ్యాడ్ లాంటి సినిమాలతో తన ప్రతిభను చాటుకున్నాడు. ఈ మూడు సినిమాల విజయాల్లో సంగీతం కీలక పాత్ర పోషించింది.

భీమ్స్ అన్ని రకాల పాటలూ ఇవ్వగలడు అనడానికి ఈ మూడు సినిమాలు రుజువు. వీటిలో ఒకదాంతో ఒకదానికి పోలిక ఉండదు. ‘ధమాకా’లో మాస్ పాటలతో అలరించాడు. ‘బలగం’లో జానపదాలతో మనసు దోచాడు. ‘మ్యాడ్’లో యూత్‌ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. త్వరలో అతను ‘గాంజా శంకర్’ అనే మాస్ సినిమాతో రాబోతున్నాడు. మన దర్శక నిర్మాతలు ఎప్పుడూ తమన్, దేవి అనకుండా.. రేంజ్ చూడకుండా ఇలాంటి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా ఛాన్స్ ఇస్తే.. వాళ్ల సత్తా ఏంటో చూపిస్తారన్న అభిప్రాయాలు కలుగుతున్నాయి.

This post was last modified on October 18, 2023 2:50 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

3 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

3 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

4 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

4 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

5 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

5 hours ago