రేపు విడుదల కాబోతున్న లియో మూవీ లోకేష్ కనగరాజ్ సృష్టిస్తున్న సినిమాటిక్ యునివర్స్ లో భాగమేనని క్లారిటీ రావడంతో అభిమానులకు కొత్త ఉత్సాహం వచ్చేసింది. శుభాకాంక్షలు చెబుతూ ఉదయనిధి స్టాలిన్ పెట్టిన ట్వీట్ లో ఇదే అర్థం రావడంతో ఫ్యాన్స్ డౌట్లు తీరిపోయాయి. అయితే లియోకి ఇంకా బాగా కనెక్ట్ కావాలంటే విక్రమ్ ని మరోసారి చూడాలనే తరహాలో చెన్నై మీడియాలో ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్టే కొద్దిరోజుల క్రితం నుంచి డిస్నీ హాట్ స్టార్ లో దీన్ని ఫ్రీ స్ట్రీమింగ్ లో ఉంచారు. అంటే ఎలాంటి చందా కట్టకుండానే ఉచితంగా చూసేయొచ్చన్న మాట.
ఇది లియో క్రేజ్ ని వాడుకోవడం కోసమా లేక ప్రమోట్ చేయడం కోసమా అంటే సమాధానం వెంటనే చెప్పలేం. రేపటి దాకా ఆగాల్సిందే. ఒక్క రజనీకాంత్, ప్రభాస్ తో చేయబోయే సినిమాలు తప్ప అన్నీ ఒకదానికి మరొకటి ముడిపడిన యునివర్లోనే ఉంటాయని లోకేష్ క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో లియోలో ఎవరి క్యామియో ఉంటుందనే సస్పెన్స్ పీక్స్ కి చేరుకుంటోంది. రామ్ చరణ్ లేడని స్పష్టంగా తెలుస్తున్నా ఇంకొందరు అభిమానులు నమ్మడం లేదు. స్క్రీన్ మీద తమకు తాము నిర్ధారించుకుంటే తప్ప శాంతించేలా లేరు. కేవలం ఈ ఒక్క పుకారు బుకింగ్స్ మీద పాజిటివ్ గా పని చేసింది.
రేపటి యుఎస్ ప్రీమియర్లతో మొదలుకుని తెలుగు రాష్ట్రాల టాక్ దాకా తమిళ తంబీలు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అందరికంటే ఆలస్యంగా ఉదయం 9 గంటలకు చూసేది వాళ్లే కాబట్టి ఈలోగా టాక్ పూర్తిగా బయటికి వచ్చేసి ఉంటుంది. కీలక ట్విస్టులు, సన్నివేశాలు థియేటర్ వీడియో రూపంలో వద్దన్నా ట్విట్టర్ లో పెట్టేస్తారు. ఇదంతా పక్కనపెడితే విక్రమ్ కు దీనికి ఒకవేళ నిజంగా కనెక్షన్ ఉండే పనైతే మాత్రం కమల్ హాసన్ లేదా కార్తీ క్యామియో చూసే అవకాశాన్ని కొట్టిపారేయలేం. చూస్తుంటే కొత్త తరం దర్శకులలో అధిక శాతం సినిమాటిక్ యునివర్స్ దారి పట్టేలా ఉన్నారు.
This post was last modified on October 18, 2023 12:56 pm
టాలీవుడ్లో యువ కథానాయకులు ఒక్కొక్కరుగా పెళ్లి వైపు అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో అల్లు శిరీష్ వివాహం చేసుకున్న…
భారీ ప్యాన్ ఇండియా మూవీ, ఇమేజ్ ఉన్న స్టార్ హీరో అని కథ పూర్తిగా వినకుండా, జల్లెడ పట్టకుండా తొందరపడితే…
సుప్రీం కోర్టు తీర్పుతో మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.…
తమ స్వంత ప్రమేయం లేకుండా ఎవరి వల్లనో ఇబ్బందులు, కష్టాలు పడాల్సి వస్తే ఆ బాధ మాములుగా ఉండదు. ఇట్లు…
కెజిఎఫ్, సలార్ రూపంలో తనకంటూ కల్ట్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. తను డైరెక్ట్ చేయకపోయినా కేవలం కథను…
225 పరుగులు చేసినా న్యూజిలాండ్‌కు విజయం దక్కలేదు. టీమ్ఇండియా మరో రెండు బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను ఛేదించింది. అయితే…