రోజుల నుంచి గంటల కౌంట్ డౌన్ లోకి భగవంత్ కేసరి వెళ్ళిపోయాడు. అదే రోజు లియో నుంచి పోటీ ఊహించిందే అయినా అది మరీ తీవ్రంగా ఉండబోతోందని అడ్వాన్స్ బుకింగ్స్ స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా బాలయ్య మాస్ కన్నా లోకేష్ అండ్ విజయ్ క్లాస్ వైపే యూత్ మొగ్గు చూపుతున్నట్టుగా టికెట్ల అమ్మకాలు చెబుతున్నాయి. అనూహ్యంగా బిసి సెంటర్లలోనూ లియోకి ప్రీ రిలీజ్ ట్రెండ్ సానుకూలంగా ఉండటం గమనించాల్సిన విషయం. ఇక భగవంత్ కేసరి విషయానికి వస్తే బిజినెస్ కోణంలో రీజనబుల్ గానే థియేట్రికల్ రైట్స్ అమ్మినట్టు ట్రేడ్ టాక్.
దీనికి సంబంధించిన వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు భగవంత్ కేసరి హక్కులను వరల్డ్ వైడ్ సుమారు 68 కోట్లకు డీల్ చేసుకున్నారు. అంటే గ్రాస్ కనీసం నూటా పది కోట్లను దాటేయాలి. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఇదేమి అసాధ్యం కాదు. వీరసింహారెడ్డి సైతం తీవ్రమైన కాంపిటీషన్ లో సులభంగా లాభాలు తెచ్చి పెట్టింది. ఇప్పుడూ అదే పరిస్థితి ఉంది. అయితే ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎక్కువ ఆకట్టుకునేలా సెంటిమెంట్, ఎమోషన్ కూడా జోడించడంతో వీకెండ్ నుంచే కుటుంబ ప్రేక్షకులను వస్తారనే అంచనాలు బయ్యర్లలో బలంగా ఉన్నాయి.
టైగర్ నాగేశ్వరరావు కూడా ఉన్నప్పటికీ బాలయ్య సినిమాలో ఉన్న కమర్షియల్ కోటింగ్ మాస్ రాజా మూవీలో తక్కువగా అనిపిస్తోంది. అది పీరియాడికల్ డ్రామా కాబట్టి ముందస్తుగా ఎలాంటి అంచనాకు రాలేం. అక్టోబర్ 25 దాకా స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ఉన్న నేపథ్యంలో ఏకధాటిగా వారం రోజుల పాటు వసూళ్లకు ఢోకా ఉండదు. ఎటొచ్చి విజయ్, రవితేజల కన్నా బెటర్ ఛాయస్ గా భగవంత్ కేసరి పేరు తెచ్చుకోవాలి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ కం ఫ్యామిలీ డ్రామాకు తమన్ సంగీతం, అర్జున్ రాంపాల్ విలనీ, శ్రీలీల పాత్ర అదనపు ఆకర్షణలుగా నిలుస్తున్నాయి.
This post was last modified on October 17, 2023 9:00 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…