తెలుగులో టాప్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. మరీ 90వ దశకం వరకు ఉన్నంత టాప్ ఫామ్‌లో ఇప్పుడు లేకపోవచ్చు కానీ.. అఖండ, వీరసింహారెడ్డి విజయాలతో ఆయన మంచి ఊపులోనే ఉన్నారు. అనిల్ రావిపూడి లాంటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌తో బాలయ్య చేసిన ‘భగవంత్ కేసరి’పై ముందు నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. దీని ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. కాబట్టి ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజిలో ఉంటాయని ట్రేడ్ పండిట్లు అంచనా వేశారు.
కానీ ఆశ్చర్యకరంగా ‘భగవంత్ కేసరి’ ప్రి సేల్స్‌లో అంత దూకుడు కనిపించడం లేదు. దీంతో పోలిస్తే అనువాద చిత్రమైన ‘లియో’కే ఎక్కువ క్రేజ్ కనిపిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ రూపొందించిన ‘లియో’ కూడా ‘భగవంత్ కేసరి’తో పాటే ఈ గురువారం రిలీజవుతున్న సంగతి తెలిసిందే. రెంటికీ దాదాపుగా ఒకేసారి బుకింగ్స్ మొదలుపెట్టారు.
ఐతే ‘లియో’కే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ డిమాండ్ నెలకొన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ సంగతే చూస్తే.. బుక్ మై షోలో ‘లియో’ షోలు చాలానే సోల్డ్ ఔట్ అయిపోయాయి. చాలా షోలు ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో ఉన్నాయి. కానీ ‘భగవంత్ కేసరి’ బుకింగ్స్‌లో అంత ఊపు కనిపించడం లేదు. చాలా తక్కువ షోలు మాత్రమే సోల్డ్ ఔట్ అయ్యాయి. చాలా వరకు షోలు గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి. అంటే ఫాస్ట్ ఫిల్లింగ్ దశలో లేవన్నమాట.
మెజారిటీ మల్టీప్లెక్సులు గురువారం ‘భగవంత్ కేసరి’తో సమానంగా ‘లియో’కు షోలు ఇచ్చాయి. వీటిలో బాలయ్య సినిమా కంటే విజయ్ మూవీకే టికెట్లు వేగంగా తెగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒక అనువాద చిత్రానికి ఇంత డిమాండ్ ఏంటా అని ఆశ్చర్యపోయే పరిస్థితి నెలకొంది. ఈ చిత్రానికి 7-8 మధ్య స్పెషల్ షోలు కూడా వేస్తున్నారు. వాటికీ డిమాండ్ బాగానే ఉంది. ఇక శుక్రవారం రిలీజవుతున్న రవితేజ మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ బుకింగ్స్ సైతం డల్లుగానే ఉన్నాయి. రిలీజ్ టైంకి పరిస్థితి మారొచ్చు కానీ.. ప్రస్తుతానికి ‘లియో’కే ఎక్కువ హైప్ కనిపిస్తోంది.
This post was last modified on October 17, 2023 2:08 pm
డిసెంబర్ 25 క్రిస్మస్ పండక్కు రిలీజ్ కావాల్సిన దాదా మళ్ళీ వాయిదా పడుతుందనే అనుమానాలు ఫిలిం నగర్ వర్గాల్లో మొదలయ్యాయి.…
సోషల్ మీడియా రాను రాను మరీ తీవ్రంగా మారిపోతోంది. ప్యారడైజ్ బాగుందా లేదానేది పక్కనపెడితే బెనిఫిట్ షో అయిన దగ్గరి…
డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. లెర్నర్ లైసెన్స్ కోసం ఇప్పటివరకు స్లాట్ బుక్…
సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి. ఏదైనా పని జరగాలి, మెసేజ్ జనానికి చేరాలి అంటే.. దీని ద్వారా…
నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 నుంచి విడుదలైన నారాయణమ్మ పాట సోషల్ మీడియాలో డిస్కషన్ కు దారి తీస్తోంది.…
ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతకు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ చేసిన సూచన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఉద్యోగం…