గత కొంత కాలంగా మెగా అల్లు కుటుంబాల మధ్య సరిగా పొసగడం లేదనే వార్తలు గట్టిగానే తిరుగుతున్నాయి. ముఖ్యంగా బన్నీ తన ఈవెంట్స్ లో ఎక్కడా చిరంజీవి ప్రస్తావన తేకపోవడం వీటికి బలం చేకూర్చగా కంబ్యాక్ తర్వాత గీత ఆర్ట్స్ బ్యానర్ లో మెగాస్టార్ ఒక్క సినిమా చేయకపోవడం, దగ్గరలో సూచనలు లేకపోవడం అనుమానాలను పెంచింది. అయినా అప్పుడప్పుడు ఇంటర్వ్యూలలో దీనికి సంబంధించిన క్లారిటీ ఆయా ఫ్యామిలీల తరఫున ఎవరో ఒకరు ఇస్తున్నారు కానీ ఫ్యాన్స్ సంతృప్తి చెందడం లేదు. అలీతో అరవింద్, యూట్యూబ్ ఛానల్ తో నాగబాబు దీని గురించి మాట్లాడారు.
ఇప్పుడో అకేషన్ ద్వారా దీనికి కాస్త చెక్ పెట్టే ప్రయత్నం చేశారు మెగా అల్లు మెంబెర్స్. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లిని పురస్కరించుకుని అల్లు అరవింద్ ఒక గ్రాండ్ పార్టీ ఇచ్చారు. దానికి రెండు వైపులా మొత్తం హాజరయ్యారు. బన్నీ నుంచి వైష్ణవ్ తేజ్ దాకా ఎవరూ మిస్ కాలేదు. చిరంజీవి, అరవింద్ సైతం ఇందులో భాగం పంచుకుని కేక్ కట్ చేశారు. సందడిగా జరిగిన ఈ మినీ వేడుక తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. రెండు రోజులు అల్లు అర్జున్ నేషనల్ అవార్డు వేడుకకు హాజరవ్వడానికి వెళ్తుండటంతో ముందే పార్టీ ఫినిష్ చేశారు.
దీని వల్ల కొంత స్పష్టత వచ్చింది కానీ ఇంతమాత్రానికే మెగా అల్లు ఫ్యాన్స్ మధ్య బేధాలు, అనుమానాలు పూర్తిగా సమిసిపోతాయని కాదు. కాకపోతే కొంతలో కొంత బెటర్. పైన చెప్పినట్టు పరస్పరం ఒకరి బ్యానర్లలో మరొకరు సినిమాలు చేసినప్పుడు వీటికి పూర్తిగా చెక్ పెట్టే అవకాశాలు పెరుగుతాయి. చిరు కొత్త సంస్థలను వెతికి మరీ ఇతర నిర్మాతలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు కానీ బావా బావమరుదులు కలిసి ఓ సినిమాకు శ్రీకారం చుట్టడం లేదు. సరే ఇది వాళ్ళ అంతర్గత అండర్ స్టాండింగ్ అని వదిలేయడం తప్ప ఎవరేం చేయగలరు. గట్టిగా అడిగితే అందరూ కలిసి చెప్పం బ్రదర్ అనేస్తారేమో.
This post was last modified on October 17, 2023 9:35 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…