సౌత్‌లో పెద్ద హిట్టయిన మాస్ సినిమాలను పట్టుకెళ్లి హిందీలో రీమేక్ చేసి హిట్టు కొట్టడంలో రోహిత్ శెట్టి సిద్ధహస్తుడు. అతను తీసే స్ట్రెయిట్ సినిమాలు సైతం సౌత్ సినిమాలను తలపించేలాగే ఉంటాయి. ఐతే మాస్ మెచ్చేలా మంచి మసాలా దట్టించి సినిమాలు తీస్తాడని పేరుంది. అందుకే బాలీవుడ్లో అత్యధిక వంద కోట్ల సినిమాలు తీసిన దర్శకుడిగా అతను రికార్డు సృష్టించాడు.
ఐతే అప్పుడప్పుడు రోహిత్‌కు బాక్సాఫీస్ దగ్గర గట్టి ఎదురు దెబ్బలు తగిలిన దాఖలాలు కూడా లేకపోలేదు. రోహిత్ చివరి చిత్రం ‘సర్కస్’ దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది. ఈ స్థితి నుంచి రోహిత్ ఎలా పుంజుకుంటాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అతను ‘లేడీ సింగం’తో రాబోతున్నాడు. ఇందులో దీపికా పదుకొనే లీడ్ రోల్ చేస్తోంది. ఈ రోజే ఆ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. కానీ ఈ లుక్‌కు ఆశించిన రెస్పాన్స్ రావట్లేదు.
ఖాకీ డ్రెస్ వేసి తుపాకీ పట్టుకుని నవ్వుతున్న దీపిక లుక్‌ను టీం రిలీజ్ చేసింది. ఐతే ‘సింగం’ సిరీస్ అంటే లీడ్ రోల్ చేసిన వాళ్లు ఫెరోషియస్‌గా ఉండాలని ఆశిస్తారు ప్రేక్షకులు. కానీ దీపికకు అసలు పోలీస్ లుక్ సెట్ అయినట్లుగా లేదు. ఆమె నవ్వుతున్న లుక్ మరీ సాధారణంగా ఉండి సినిమా మీదే అంచనాలు తగ్గించేసేలా ఉంది. ఇదేదో స్పూఫ్ మూవీలా అనిపిస్తోంది జనాలకు.
అసలే రోహిత్ సినిమాలు మరీ ఔట్ డేటెడ్‌గా తయారవుతున్నాయనే అభిప్రాయాలు పెరిగిపోతున్నాయి. ఒక మూసలో సినిమాలు తీస్తే నడిచే పరిస్థితి లేదు ఇప్పుడు. అలాంటిది దీపికను పెట్టి ‘లేడీ సింగం’ అనేసరికి ఏదో తేడా కొడుతోంది జనాలకు. హీరోయిన్ని పోలీస్‌గా పెట్టి యాక్షన్ పండించడం అంటే అంత ఈజీ కాదు. ‘సింగం’ ఫ్రాంఛైజీని మరీ ఎక్కువ పిండేసి, కాసులు రాల్చుకునే ప్రయత్నంలా కనిపిస్తోందిది. సినిమా నుంచి ఒక మంచి టీజర్ వస్తే తప్ప ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచడం కష్టమే.
This post was last modified on October 15, 2023 8:22 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…