నేచురల్ స్టార్ నానికి క్లాస్ హీరోగా పేరుంది. కెరీర్లో అతను చాలా వరకు క్లాస్ టచ్ ఉన్న సినిమాలే చేశాడు. వాటితోనే నిర్మాతలకు మంచి లాభాలు కూడా తెచ్చిపెట్టాడు. అలా అని అతను మాస్ చేయలేడని కాదు. అందులోకి దిగితే ఎలా ఉంటుందో ‘దసరా’ చూపించింది. ఈ సినిమాతో పెద్ద పెద్ద స్టార్ల సినిమాలతో సమానంగా ఓపెనింగ్స్ రాబట్టాడు నాని. అందులో ఊర మాస్ స్టయిల్లో కనిపించిన నాని.. ఇప్పుడు మళ్లీ తన స్టైల్లోకి మారిపోయి ‘హాయ్ నాన్న’ అంటూ వస్తున్నాడు.
ఐతే మాస్ సినిమా అయిన ‘దసరా’తో పోలిస్తే ‘హాయ్ నాన్న’కు ఆ స్థాయిలో వసూళ్లు వస్తాయా అన్నది డౌట్‌గా ఉంది. ఐతే ఏ సినిమా స్ట్రెంత్ దానికి ఉంటుందని.. కేవలం థియేట్రికల్ వసూళ్లను బట్టే ఒక సినిమా సక్సెస్‌ను అంచనా వేయడానికి వీల్లేదని ‘హాయ్ నాన్న’ టీజర్ లాంచ్ కార్యక్రమంలో నాని పేర్కొన్నాడు. జెర్సీ, శ్యామ్ సింగ రాయ్ లాంటి సినిమాలు కమర్షియల్‌గా అనుకున్నంత సక్సెస్ కాలేదన్న అభిప్రాయాలను అతను ఖండించాడు.
‘‘జెర్సీ సినిమా గురించి చాలామందికి అవగాహన లేదనుకుంటా. ఆ సినిమా మీద పది రూపాయలు పెడితే వంద రూపాయలు వచ్చాయి. అది భారీగా లాభాలు తెచ్చిపెట్టిన సినిమా. అది థియేటర్లలో బాగా ఆడింది. ఐతే చాలామంది థియేటర్లలో వచ్చిన వసూళ్లను మాత్రమే చూసి ఒక సినిమా సక్సెస్‌ను అంచనా వేస్తుంటారు. శాటిలైట్, డిజిటల్ రైట్స్ ద్వారా ఆ సినిమా ఎంత ఆదాయం తెచ్చిందని చూడాలి.
అలాగే డబ్బింగ్, రీమేక్ రైట్స్ ద్వారా కూడా డబ్బులు వస్తుంటాయి. ఈ కోణంలో చూస్తే ‘జెర్సీ’ చాలా పెద్ద సక్సెస్. ‘శ్యామ్ సింగరాయ్’ కూడా ఇలాగే మంచి సక్సెస్ అయింది. ‘అంటే సుందరానికి’ సినిమా విషయంలో కొంచెం తేడా జరిగింది అంటే ఒప్పుకుంటా. కానీ నేను చేసిన మిగతా క్లాస్ సినిమాలన్నీ చాలా బాగా ఆడాయి’’ అని నాని స్పష్టం చేశాడు. ‘హాయ్ నాన్న’ కూడా మంచి సక్సెస్ అవుతుందని నాని ధీమా వ్యక్తం చేశాడు. టీజర్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రం డిసెంబరు 7న విడుదల కాబోతోంది.
This post was last modified on October 15, 2023 8:23 pm
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్‌కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…