హిట్టు ఫ్లాపు పక్కనపెడితే హీరో సందీప్ కిషన్ కు యూత్ లో మంచి గుర్తింపు ఉంది. కుర్రాడు కష్టపడతాడు కానీ దానికి తగ్గ బాక్సాఫీస్ ఫలితాలే దక్కడం లేదు. సరైన కథ దర్శకుడు దొరికితే హిట్టు కొట్టే సత్తా ఉందని నిను వీడని నీడను నేనే లాంటి హారర్ మూవీ రుజువు చేసింది. ఇతని కొత్త సినిమా ఊరు పేరు భైరవకోన ఎప్పుడు విడుదలో తెలియక అభిమానులు అయోమయపడుతున్నారు. ఎక్కడికి పోతావు చిన్నవాడా, టైగర్, డిస్కో రాజా లాంటి విలక్షణ చిత్రాలతో ఆకట్టుకున్న విఐ ఆనంద్ దర్శకుడు కావడంతో దీని మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఎప్పుడో నెలల క్రితం వదిలిన లిరికల్ సాంగ్, టీజర్ తర్వాత అప్డేట్స్ లేవు
పాటేమో యాభై మిలియన్ల వ్యూస్ దాటేసింది కానీ అసలు సినిమా రిలీజ్ ఎప్పుడో అంతు చిక్కడం లేదు. కనీసం ఫలానా నెలలో ఉండొచ్చనే క్లూలు సైతం టీమ్ ఇవ్వడం లేదు. ఊరు పేరు భైరవకోనకు రాజేష్ దండ నిర్మాత కాగా అనిల్ సుంకర సమర్పకులు. ఏజెంట్, భోళా శంకర్ తీవ్రంగా నష్టపరచగా ప్రెజెంట్ చేసిన సామజవరగమన పెద్ద హిట్టు కొట్టింది. హిడింబ నిరాశ పరిచింది. ఇప్పుడీ సందీప్ కిషన్ తో ఇంత బడ్జెట్ తో తీసిన మూవీ సందిగ్ధంలో పడింది. నవంబర్ నుంచి జనవరి దాకా మొత్తం స్లాట్లు బ్లాక్ అయిపోయాయి. మధ్యలో ఎక్కడైనా ప్లాన్ చేసుకున్నా కనీసం ఆ సమాచారం షేర్ చేసుకోవాలి.
కానీ ఆ సూచనలేమి లేవు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం కథ పరంగా విరూపాక్షతో కొన్ని పోలికలు వచ్చిన కారణంగా అవసరమైన మేరకు కొంత రీ షూట్ చేసే ప్రతిపాదన ఉన్నట్టు తెలిసింది. భైరవకోన అనే ఊరిలో జరిగిన కొన్ని మిస్టరీ సంఘటనల ఆధారంగా విఐ ఆనంద్ ఈ సబ్జెక్టు సిద్ధం చేశారు. కల్పితమే అయినా ఆడియన్స్ కి ఫ్రెష్ గా చెప్పాలన్న ఉద్దేశంతో కొంత ఆలస్యం చేస్తున్నట్టు తెలిసింది. టీజర్ విజువల్స్ ఆకట్టుకున్నాయి. ఏది ఏమైనా ఇంత లేట్ కావడం సేఫ్ కాదు. శేఖర్ చంద్ర సంగీతం సమకూరుస్తున్న ఈ థ్రిల్లర్ లో వర్ష బొల్లమ, కావ్య థాపర్ హీరోయిన్లు నటిస్తున్నారు.
This post was last modified on October 14, 2023 12:35 pm
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…