టాలీవుడ్ లో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ముందు గుర్తొచ్చే పేరు పేరు శ్రీలీల. ఆ తర్వాతే ఎవరైనా. నెలకో రిలీజ్ చొప్పున సెప్టెంబర్ నుంచి జనవరి దాకా బిజీగా ఉన్న కథానాయిక తను ఒక్కర్తే. ఇటీవలే స్కంద రూపంలో డిజాస్టర్ తగిలింది. అందులో పాత్ర కానీ, రామ్ తో పోటాపోటీగా చేసిన డాన్సులు కానీ ఏవీ పేరు తీసుకురాలేదు. పైపెచ్చు సెకండ్ హాఫ్ లో ఏ ప్రాధాన్య లేక మొక్కుబడిగా మిగిలిపోవడంతో దాని వల్ల కలిగిన ప్లస్ ఏమి లేదు. గత ఏడాది ధమాకా ఇచ్చిన ఆనందం దీని వల్ల కొంత తగ్గిన మాట వాస్తవం. అయితే భగవంత్ కేసరితో ఈ లెక్కలు మారిపోతాయని అమ్మడు ధీమాగా ఉంది.
బాలయ్య సినిమాలో హీరోయిన్ గా చేయని ఆర్టిస్టుకు పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే పాత్ర దొరకడం కష్టం. కానీ దర్శకుడు అనిల్ రావిపూడి దాన్ని డిజైన్ చేశాడు. హీరో కంటికి రెప్పలా కాపాడుకునే విజ్జి పాప క్యారెక్టర్ కేవలం ట్రైలర్, లిరికల్ సాంగ్స్ తోనే ఫ్యామిలీ ఆడియన్స్ లోకి వెళ్లిపోయింది. ఎలాగూ బాలకృష్ణ కోసం వచ్చే ఆడియెన్స్ ఉంటారు కానీ ప్రత్యేకంగా ఈ అమ్మాయి గురించే టికెట్లు కొనే అభిమానులు సెపరేట్ గా వస్తారు. పైగా కథలోని కీలకమైన ఎమోషన్స్ అన్నీ విజ్జి చుట్టే తిరుగుతాయి. బాలయ్య ఆయుధం పట్టి శత్రువుల ఊచకోత చేసేందుకు కారణం కూడా శ్రీలీలే.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య వచ్చే బాండింగ్ సీన్స్, భావోద్వేగాలు కట్టి పడేస్తాయని ఇన్ సైడ్ టాక్. ఈ లెక్కన హీరోతో ఆడిపాడే టైపు కాకపోయినా తనలో నటిని బయటికి తీసుకొచ్చేందుకు దోహదపడిన క్యారెక్టర్ కాబట్టి శ్రీలీల ఆనందంగా ఒప్పుకుంది. పెద్దన్న, భోళా శంకర్ లో కీర్తి సురేష్ కి బలవంతంగా జోడిని సెట్ చేసినట్టు భగవంత్ కేసరిలో అలాంటి పొరపాటు చేయలేదు. ఎవరో కుర్ర హీరోని తీసుకొచ్చి అవసరం లేకపోయినా లవ్ ట్రాక్ ఇరికించడం లాంటి ఫార్ములా జోలికి అనిల్ వెళ్ళలేదు. ప్రీ రిలీజ్ వైబ్స్ చూస్తుంటే బాలయ్యతో పాటు శ్రీలీలకు సాలిడ్ గా గుర్తుండిపోయే హిట్టు పడేలా ఉంది.
This post was last modified on October 14, 2023 2:04 pm
దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ ప్రాణాల భద్రతకు…
ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…
రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…
సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…
టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం కెరీర్ పరంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. 'ధమాకా' సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న…