వేగంగా సినిమాలు చేయడం ఒకరకంగా మంచిదే కానీ వాటి ఫలితాలు తేడాగా ఉంటేనే అవసరం లేని ట్రోలింగ్ కి అవకాశమిస్తుంది. కిరణ్ అబ్బవరం ఈ ఏడాది మూడు సినిమాలతో పలకరించాడు. వినరో భాగ్యము విష్ణు కథ డీసెంట్ అనిపించుకోగా మీటర్, రూల్స్ రంజన్ ఒకదాన్ని మించి మరొకటి అల్ట్రా డిజాస్టర్స్ అయ్యాయి. వీటి కన్నా ముందు నేను మీకు బాగా కావాల్సినవాడినే సైతం సూపర్ ఫ్లాపుల లిస్టులోకి చేరిపోయింది. ఇవన్నీ కిరణ్ మార్కెట్ మీద ప్రభావం చూపిస్తున్న మాట వాస్తవం. ఓటిటి, డబ్బింగ్ బిజినెస్ లు ఒక్కటే ఎల్లకాలం కుర్ర హీరోల కెరీర్లను నిలబెట్టలేవు.
ఇదిలా ఉండగా కిరణ్ అబ్బవరం చేతిలో ఒక ప్యాన్ ఇండియా మూవీ ఉంది. తేజ సజ్జతో హనుమాన్ ని భారీ బడ్జెట్ తో నిర్మించి సంక్రాంతి బరిలో నిలిపిన ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ సంస్థ నెలల క్రితమే ప్రాజెక్టుని ఓకే చేసింది. కొత్త దర్శకుడిని నమ్మి ముప్పై నలభై కోట్లు డిమాండ్ చేసే పీరియాడిక్ డ్రామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే దీన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. కేవలం తెరవెనుక వ్యవహారం నడిచింది. స్క్రిప్ట్ పనులు గట్రా జరుగుతున్నాయి కానీ ఫైనల్ వెర్షన్ లాకయ్యాక అనౌన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేదే సస్పెన్స్.
ప్రస్తుతం కిరణ్ కు నిర్మాణం పూర్తయ్యే స్టేజిలో దిల్ రుబా ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. బ్యాలన్స్ ఉన్న ప్యాచ్ వర్క్ త్వరలో పూర్తి చేస్తారు. ఇప్పుడీ యూత్ హీరో మీద పెద్ద బడ్జెట్ వర్కౌట్ కావాలంటే కనీసం ఒకటి రెండు ఎస్ఆర్ కల్యాణమండపంని మించిన బ్లాక్ బస్టర్లు పడాలి. అప్పుడే డిస్ట్రిబ్యూటర్లు నిర్మాత పెట్టిన ఖర్చుకు తగ్గట్టుగా హీరోని నమ్మి కోట్ల పెట్టుబడికి రెడీ అవుతారు. గుడ్డిగా కిరణ్ మీద సొమ్ములు కుమ్మరించే పరిస్థితి లేదిప్పుడు. మరి ప్యాన్ ఇండియా కొంత లేట్ అవుతుందా లేక ముందు దీంతో హిట్టు కొట్టేసి అతని సత్తా ఋజువు చేద్దామని ముందకెళ్తారో చూడాలి.
This post was last modified on October 12, 2023 1:16 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…