అదేంటి ఏడాదికోసారి వచ్చే హీరో పుట్టినరోజుకి నిర్మాతలు టెన్షన్ దేనికి అనుకుంటున్నారా. వేరే స్టార్లకు ఏమో కానీ ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా డైనోసర్ ది మాత్రం ఖచ్చితంగా స్పెషల్ గా ఉండాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తారు. అక్టోబర్ 23 ఎంతో దూరంలో లేదు. పదకొండు రోజులు ఆగితే డార్లింగ్ బర్త్ డే రాబోతోంది. కొత్త సినిమాలు సెట్స్ మీద భారీగా ఉన్నాయి కాబట్టి చాలా ఎక్కువ అప్డేట్స్ ఉంటాయని అభిమానులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా సలార్ ట్రైలర్ మీద గంపెడాశలు పెట్టుకున్నారు. కల్కి టీమ్ ఎలాగూ ఒక పోస్టరో చిన్న టీజరో వదులుతుంది. అందులో సందేహం లేదు.
ఎటొచ్చి సలార్ ట్రైలర్ రావడమే అనుమానమని బెంగళూరు టాక్. విపరీతమైన ఒత్తిడి మధ్య పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రతి విషయంలో విపరీతమైన శ్రద్ధ తీసుకుంటున్నాడు. అందులో భాగంగా ట్రైలర్ కూడా ఆల్టిమేట్ ఇవ్వాలనే ఉద్దేశంతో రెండు మూడు వెర్షన్లు తయారు చేయిస్తున్నాడట. అయితే ఏదీ పూర్తి సంతృప్తినివ్వడం లేదని వినికిడి. తనకు పూర్తిగా బెస్ట్ అనిపించే వరకు వదిలే సమస్య లేదని చెప్పాడట. దీని స్థానంలో సినిమాలో ఏదైనా పాటకు సంబంధించిన లిరికల్ వీడియోని వదిలినా ఆ లోటుని కొంత వరకు భర్తీ చేయొచ్చు.
ఇక మారుతీ సినిమా గురించి ఎలాంటి న్యూస్ ఉండకపోవచ్చు. ప్రస్తుతం సలార్ హైప్ నుంచి డీవియేట్ అయ్యేలా ఏదీ చేయకూడదని ప్రభాస్ ఇతర నిర్మాతలకు ముందే చెప్పడంతో స్పిరిట్ ప్రొడ్యూసర్లు సైతం సైలెంట్ గానే ఉంటారు. సో ఫైనల్ ఆ రోజు ఏమివ్వాలనే ఆందోళన సలార్ ప్రొడ్యూసర్లను ఒత్తిడికి గురి చేస్తోంది. న్యాయంగా చెప్పాలంటే సలార్ నుంచే రావడం కరెక్ట్. డిసెంబర్ 22 విడుదలకు అప్పటికి కేవలం రెండు నెలలు మాత్రమే సమయం ఉంటుంది. ఏం చేస్తారో చూడాలి. ఇతర ప్రొడక్షన్ హౌసుల నుంచి గ్రీటింగ్స్ తప్ప అఫీషియల్ ప్రాజెక్ట్ ప్రకటనలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ.
This post was last modified on October 12, 2023 11:38 am
సంక్రాంతి దసరా తర్వాత తెలుగులో సినిమాలకు మంచి డిమాండ్ ఉన్న సీజన్ అంటే.. క్రిస్మసే. క్రిస్మస్ సెలవుల్లో వచ్చే రెండు…
వచ్చే ఏడాది ఏప్రిల్ 10 విడుదల తేదీని ఎప్పుడో లాక్ చేసుకున్న ది రాజా సాబ్ వాయిదా పడుతుందనే వార్తలు…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు శ్రీ తేజ్ ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో…
అంతర్జాతీయగా మోస్ట్ పాపులర్, సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ల్లో.. ‘స్క్విడ్ గేమ్’ ఒకటి. ఈ కొరియన్ వెబ్ సిరీస్ మూడేళ్ల…
‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ నినాదంతో పార్లమెంటులో జమిలి బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2027లో సార్వత్రిక ఎన్నికలు,…
ఆంధ్రప్రదేశ్ను ఐదేళ్ల పాటు పాలించిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నేతల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు. వైసీపీ…