గత వారాంతం అరడజనుకు పైగా సినిమాలు రిలీజయ్యాయి తెలుగులో. ఐతే వాటిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి, థియేటర్లలో సందడి చేసిన సినిమాలు చాలా తక్కువ. 800, మంత్ ఆఫ్ మధు, చిన్నా లాంటి చిత్రాలకు ముందే ప్రిమియర్స్ వేసి.. పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చేసే ప్రయత్నం జరిగినా పెద్దగా ఫలితం లేకపోయింది. వీటిలో దేనికీ థియేటర్లలో జనాలు లేరు. తొలి రోజే థియేటర్లు వెలవెలబోయి షోలు క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది.
ఇక ‘రూల్స్ రంజన్’, ‘మామా మశ్చీంద్ర’ చిత్రాలకు మార్నింగ్ షోల వరకు కొంచెం సందడి కనిపించినా బ్యాడ్ టాక్‌తో మధ్యాహ్నానికే వాటి పనైపోయింది. ఒక్క ‘మ్యాడ్’ సినిమా మాత్రం ముందు రోజు ప్రిమియర్స్ నుంచే క్రేజ్ తెచ్చుకుని ఉదయానికి థియేటర్లను కళకళలాడించింది. తొలి రోజు సాయంత్రానికి మరింతగా థియేటర్లలో సందడి కనిపించింది.
తొలి వీకెండ్ వరకు ‘మ్యాడ్’ మంచి వసూళ్లు రాబట్టింది. ఆదివారం నాటికి ఈ చిత్రం రూ.8 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. తొలి రోజు కంటే రెండో రోజు, రెండో రోజు కంటే మూడో రోజు వసూళ్లు ఎక్కువ రావడం విశేషం. ఐతే ఉన్నంతలో వసూళ్లు బాగున్నాయి కానీ.. వచ్చిన పాజిటివ్ టాక్, బాక్సాఫీస్ దగ్గర అనుకూల పరిస్థితుల్లో ఈ చిత్రం మరీ భారీగా ఏమీ వసూళ్లు రాబట్టలేదు. అందరూ ఈ చిత్రాన్ని ‘జాతిరత్నాలు’తో పోల్చి ఆ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అనుకున్నారు.
కానీ వీకెండ్ వరకు చూసుకుంటే ఆ సినిమాలో సగం వసూళ్లే సాధించింది ‘మ్యాడ్’. ఇక వీకెండ్ తర్వాత వసూళ్లు కొంచెం తగ్గాయి. కానీ పరిస్థితి ఆశాజనకంగానే ఉంది. ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్న ఏకైక చిత్రం ఇదే. యూత్ బాగానే చూస్తున్నారు. దాదాపుగా అన్ని ఏరియాల్లోనూ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఈ వీకెండ్లో చెప్పుకోదగ్గ రిలీజ్‌లు ఏమీ లేవు కాబట్టి.. అదే విన్నర్ కాబోతోంది. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.10 కోట్ల షేర్ మార్కును అందుకునే అవకాశాలను కొట్టిపారేయలేం.
This post was last modified on October 11, 2023 7:28 pm
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…