న్యాచురల్ స్టార్ నాని హాయ్ నాన్నవిడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. సుమ కొడుకు రోషన్ కనకాల ట్రైలర్ లాంచ్ లో ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తామని చెప్పాడు కానీ డేట్ గురించి స్పష్టత ఇవ్వలేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం డిసెంబర్ 7 తేదీతో ఆల్రెడీ పోస్టర్లు డిజైన్ చేయించి సిద్ధంగా ఉంచారు. కన్ఫర్మ్ చేసుకోవడం ఆలస్యం క్షణాల్లో వాటిని ఆన్ లైన్ లో వదిలేందుకు రంగం రెడీ అయ్యింది. కానీ అదే టైంలో గ్యాంగ్ అఫ్ గోదావరి, ఆపరేషన్ వాలెంటైన్, ఎక్స్ ట్రాడినరీ మ్యాన్, మెర్రి క్రిస్మస్ రేసులో ఉన్నాయి. ఎవరూ వెనక్కు తగ్గే పరిస్థితి ఏ మాత్రం కనిపించడం లేదు.
వీటిలో నటించిన హీరోల కన్నా నాని మార్కెట్ పెద్దది కానీ కంటెంట్ పరంగా చూసుకుంటే హయ్ నాన్న ఎమోషన్ల మీద నడిచే ఫాదర్ సెంటిమెంట్ డ్రామా. పోటీలో ఉన్నవాటిలో రెండు ఊర మాస్ కంటెంట్, ఒకటి క్రైమ్ థ్రిల్లర్ మరొకటి స్పేస్ జానర్. సో వెయిట్ ప్రకారం చూసుకుంటే ఫ్యామిలీ ఆడియన్స్ ని ముందుగా ఆకట్టుకునేది నానినే అయినప్పటికీ బిసి సెంటర్స్ లో విశ్వక్ సేన్, నితిన్ లను మరీ తక్కువ చేసి చూడ్డానికి లేదు. సరైన కథ పడితే ఒక్కసారిగా జనాలను థియేటర్లకు రప్పించే కెపాసిటీ వాళ్ళకుంది. సినిమా మరీ బాలేకపోతేనే వీళ్ళవి పడకేస్తాయి.
అలాంటప్పుడు నవంబర్ లో వద్దామా లేక ఫిబ్రవరికి వెళ్దామా అనే చర్చలు జరుగుతున్నాయట. అసలు ఈ గోలంతా ఎందుకు శుభ్రంగా ఏదైతే అదయ్యింది లెమ్మని డిసెంబర్ 7కే ఫిక్స్ అవుదామాని రేపో ఎల్లుండో వీలైనంత త్వరగా తేల్చాయాలి. పోనీ దీపావళి ఆప్షన్ చూసుకుంటే ఇతర భాషల్లో సల్మాన్ ఖాన్ టైగర్ 3 ముప్పు పొంచి ఉంది. థియేటర్ల సమస్యతో పాటు పలు రకాల ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ అంతర్మథనమంతా కేవలం సలార్ వల్ల వచ్చిందనేనని ప్రత్యేకంగా గుర్తు చేయనక్కర్లేదు కానీ ఇప్పటికిప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటనే ఆలోచనలతో నాన్న టీమ్ బుర్రలు వేడెక్కిపోతున్నాయి.
This post was last modified on October 11, 2023 5:30 pm
ఏపీ అసెంబ్లీలో ఓ వింత పరిస్థితి కనిపిస్తోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమైపోయిన వైసీపీకి సభలో ప్రధాన…
కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు స్టార్లు లేకపోయినా బ్రహ్మాండంగా ఆదరిస్తారని గతంలో బలగం లాంటివి ఋజువు చేస్తే తాజాగా కోర్ట్…
మే 9 విడుదల కాబోతున్న హరిహర వీరమల్లు కన్నా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి మీదే ఎక్కువ ప్రేముందనేది బహిరంగ…
విడుదలై నెలరోజులు దాటుతున్నా ఛావా పరుగులు ఆగడం లేదు. వీక్ డేస్ లో నెమ్మదించినప్పటికీ వారాంతం వస్తే చాలు విక్కీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మాట ఇచ్చారంటే.. అది క్షణాల్లో అమలు కావాల్సిందే. ఇదేదో……
ఓ వైపేమో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అధికారంలో ఉంటే… విపక్షాలు సైతం తమ కార్యక్రమాలను ఘనంగా…