సాయి పల్లవితో కలిసి చేసిన ‘ఎంసిఏ’ చిత్రంతో నాని తన కెరియర్‍లోనే బిగ్గెస్ట్ హిట్ సాధించాడు. అప్పట్లో సాయి పల్లవికి వున్న ‘ప్రేమమ్’ క్రేజ్ ఆ చిత్రం ఓపెనింగ్స్ కి ప్లస్ అయింది. మళ్లీ వీళ్లిద్దరూ కలిసి ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో నటించబోతున్నారు.
ఈ పాత్ర కోసం పలువురు బాలీవుడ్ హీరోయిన్లను సంప్రదించి చివరకు సాయి పల్లవిని ఖాయం చేసుకున్నారు. ఇది రెగ్యులర్ హీరోయిన్ రోల్ కాదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో సాయి పల్లవి నెగెటివ్ షేడ్స్ వున్న విలన్ తరహా క్యారెక్టర్‍లో కనిపిస్తుందట. నాని, సాయి పల్లవి మధ్య హోరాహోరీ సన్నివేశాలుంటాయనే గాసిప్స్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.
అయితే దీనిపై ఇంకా నాని లేదా చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‍టైన్‍మెంట్స్ స్పందించలేదు. ఇకపోతే ఇందులో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నాడని, ఇది సైన్స్ ఫిక్షన్‍తో కూడిన డిఫరెంట్ సబ్జెక్ట్ అని కూడా లీక్స్ వచ్చాయి. ఈ చిత్రానికి బడ్జెట్ ఎక్కువ కనుక ప్రస్తుత పరిస్థితులలో వాయిదా వేస్తారనే ప్రచారం జరిగింది కానీ ‘టక్ జగదీష్’ తర్వాత నాని ఈ చిత్రమే చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాదిలో మొదలవుతుంది. ఇది 2021 దసరా సీజన్లో విడుదలయ్యే అవకాశాలున్నాయి.
This post was last modified on August 26, 2020 2:51 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…