ఆమె కోసం నిర్మాతల క్యూ… కానీ డేట్లు లేవు

కీర్తి సురేష్‍తో సినిమా చేస్తే ఖచ్చితంగా ప్లస్సే అని ఈ లాక్‍డౌన్‍లో నిర్మాతలకు క్లారిటీ వచ్చేసింది. దక్షిణాది అంతటా కీర్తి పాపులర్‍ అవడం వల్ల ఆమె నటించిన చిత్రాల హక్కులను ఓటీటీ కంపెనీలు పెద్దగా ఆంక్షలు లేకుండా, ఎక్కువగా బేరాలు ఆడకుండా కొనేస్తున్నాయి.

సినిమా బాగున్నా, లేకపోయినా కానీ కీర్తి హీరోయిన్‍ అంటే వ్యూస్‍ అయితే గ్యారెంటీ. అందుకే ఆమె ప్రధాన పాత్రలో నటించిన మూడు సినిమాల హక్కులను ఓటిటిలు కొన్నాయి. దీంతో కీర్తి సురేష్‍తో లేడీ ఓరియంటెడ్‍ కథలు తెరకెక్కించాలని నిర్మాతలు పోటీ పడుతున్నారు. కానీ ఆమె ఇప్పుడు అలాంటి చిత్రాలకు బ్రేక్‍ ఇచ్చింది.

మహానటి తర్వాత భారీ బడ్జెట్‍ చిత్రాల్లో నటించడం తగ్గించేసిన కీర్తి ‘సర్కారు వారి పాట’ నుంచి ఇక డిమాండ్‍కి తగ్గట్టు పెద్ద సినిమాలకు డేట్స్ ఇవ్వాలని డిసైడ్‍ అయింది. వరుసగా అన్నీ లేడీ ఓరియెంటెడ్‍ సినిమాలు చేయడం కూడా హీరోయిన్స్ ఇమేజ్‍కి మంచిది కాదు.

సాధారణంగా హీరోయిన్లుగా ఒక పదేళ్ల పాటు భారీ చిత్రాలు చేసిన తర్వాత ఇలాంటి సినిమాలు చేయడానికి హీరోయిన్స్ ఆసక్తి చూపిస్తారు. మొదట్నుంచీ ఇలాంటి మూసలో పడిపోతే తర్వాత వాళ్లతో నటించడానికి అగ్ర హీరోలు ఇష్టపడరు.