దసరా సినిమాల హడావిడి క్రమంగా పీక్స్ కు చేరుకుంటోంది. ప్రమోషన్లు ఊపందుకున్నాయి. మూడు ట్రైలర్లు వచ్చేశాయి. భగవంత్ కేసరి మాసు క్లాసుకి ఎక్కే కంప్లీట్ ప్యాకేజ్ లాగా కనిపిస్తుండగా లియో మీద హాలీవుడ్ మూవీ ఏ హిస్టరీ అఫ్ వయొలెన్స్ ప్రభావం ఉందని అర్థమైపోయింది. తెలుగు వెర్షన్ వరకు చూసుకుంటే కామన్ ఆడియన్స్ విజయ్ మూవీని ఇంకా సీరియస్ గా తీసుకోలేదు. టైగర్ నాగేశ్వరరావు వీటితో పోలిస్తే చాలా డిఫరెంట్, యునీక్ కాన్సెప్టని ఒప్పుకోవాలి. కానీ దీనికైన బడ్జెట్ కి, తీసుకున్న కాన్వాస్ కి పబ్లిక్ లో భీభత్సమైన అంచనాలు నెలకొనాలి. ఇంకా అవి పికప్ కాలేదు.
ప్యాన్ ఇండియా మూవీ కావడంతో నిర్మాత అభిషేక్ అగర్వాల్ ముందు పబ్లిసిటీని నార్త్ నుంచి మొదలుపెట్టారు. రవితేజకు ఉత్తరాది ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది కానీ మరీ మొదటి రోజు థియేటర్ కు రప్పించేంత అయితే కాదు. అయినా సరే కార్తికేయ 2 లాగా ఇదీ ఒక్కసారిగా ఊపందుకుంటుందని లెక్కలేసుకుంటున్నారు. కానీ తెలుగు వెర్షన్ మాత్రం ఇంకా ప్రచార పర్వం పీక్స్ అవ్వలేదు. చివరి నాలుగైదు రోజులు ఉన్నప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రెస్ మీట్లు గట్రా ప్లాన్ చేశారు కానీ ఇంత విపరీతమైన పోటీ ఉన్నప్పుడు ఇంకాస్త ముందస్తుగా సెట్ చేసుకోవాల్సింది. చివరి నిమిషం దాకా పరిగెత్తేంత చిన్న కంటెంట్ కాదుగా.
టైగర్ నాగేశ్వరరావు ఎంత గ్రాండియర్ గా ఉన్నా, ఎంత గొప్పగా తీసినా తమకు అలవాటు లేని స్టువర్ట్ పురం వ్యవహారం, పేరుమోసిన ఒక తెలుగు దొంగకు సంబంధించిన బయోపిక్ మీద హిందీ జనాలకు అంతగా ఆసక్తి ఉండదు. సైరా నరసింహారెడ్డి లాంటి వాటిని అందుకే రిసీవ్ చేసుకోలేదు. పైగా టైగర్ పాటలు ఛార్ట్ బస్టర్ కాలేదు. జివి ప్రకాష్ కుమార్ అసలు మేజిక్ ఇంకా బయట పడలేదు. కావాల్సినంత మాస్ కంటెంట్ పుష్కలంగా ఉన్నప్పటికీ దాన్ని ఇంకా బెటర్ గా రివీల్ చేస్తే తప్ప భగవంత్ కేసరి, లియోల కన్నా ముందు ఫస్ట్ ఛాయస్ దీన్ని పెట్టుకుందామనే ఆలోచన న్యూట్రల్ ఆడియన్స్ కి రాదు.
This post was last modified on October 10, 2023 7:40 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…