Movie News

చేతులు మారిన నవీన్ పోలిశెట్టి మూవీ

ఒక సినిమా మొదలుపెట్టి కొంత స్టేజి దాటాక చేతులు మారడం సహజం. చాలాసార్లు జరిగిన వ్యవహారమే. అధిక సందర్భాల్లో కారణాలు బయటికి చెప్పరు కానీ ఏకాభిప్రాయం రాకపోవడం కన్నా వేరొక రీజన్ ఉండదు. మహేష్ బాబు నో చెప్పాకే సుకుమార్ పుష్పని తీసుకెళ్లి అల్లు అర్జున్ కి సెట్ చేశాడు. బన్నీ వద్దన్నాకే కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ దేవరకు రంగం సిద్ధమయ్యింది. ఇప్పుడు అలాంటిదే మరో కేసు. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లతో మంచి ఊపుమీదున్న నవీన్ పోలిశెట్టి మరో సినిమా అనగనగా ఒక రాజు ఎప్పుడో గత ఏడాదే మొదలై కొంత భాగం షూటింగ్ కూడా జరుపుకుంది.

ఏమైందో ఏమో కానీ మధ్యలో బ్రేక్ పడింది. ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు లాక్ చేసుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్. సితార బ్యానర్ పై నాగవంశీ మంచి బడ్జెట్ తోనే స్కెచ్ రెడీ చేశారు. అయితే ఆగిపోయే సూచనలు కనిపించడంతో దాని స్థానంలో తన సోదరి హారికని నిర్మాతగా పరిచయం చేస్తూ మ్యాడ్ సినిమాని కళ్యాణ్ శంకర్ చేతుల్లో పెట్టారు. కట్ చేస్తే అది మంచి హిట్ దిశగా దూసుకుపోతోంది. ఇప్పుడా పెండింగ్ లో పడ్డ రాజుని జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కి ఇచ్చినట్టు లేటెస్ట్ అప్ డేట్. జాతిరత్నాలు రైటింగ్ టీమ్ లో కళ్యాణ్ శంకర్ ఉన్నప్పటి నుంచే వీళ్ళ మధ్య బాండింగ్ ఉంది.

సో పెద్దగా అపార్థాలు గట్రా లేకుండానే కాంబో మారిపోయినట్టు తెలిసింది. అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ రేపో ఎల్లుండో చెప్పేయొచ్చు. ఇంతకు ముందు శ్రీలీలని హీరోయిన్ గా తీసుకున్నారు. ఇప్పుడు తనే ఉంటుందో లేదో చూడాలి. తమన్ సంగీతం కొనసాగవచ్చు. జాతిరత్నాలు తర్వాత ప్రిన్స్ తో షాక్ తిన్న అనుదీప్ రచయితగానూ ఫస్ట్ డే ఫస్ట్ షోకి డిజాస్టర్ రుచి చూశాడు. సో బలమైన కంబ్యాక్ కావాలి. తన వన్ లైనర్స్ బ్రహ్మాండంగా పలికించగలిగే నవీన్ పోలిశెట్టి దొరికితే అంతకన్నా కావాల్సింది ఏముంది. కథ మాత్రం అనగనగా ఒక రాజుకు ముందు అనుకున్నదే ఉంటుందట.

This post was last modified on October 10, 2023 1:42 pm

Share

Recent Posts

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

40 minutes ago

మల్టీస్టారర్ మూవీకి మర్చిపోలేని అవమానం

కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…

1 hour ago

ఆంధ్రా ముద్దుబిడ్డ అనంత్ అంబానీ

నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…

2 hours ago

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

2 hours ago

వివేకా కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు

వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…

3 hours ago

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

3 hours ago