మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు గేమ్ చేంజర్ అప్డేట్స్ ఇవ్వండి మహాప్రభో అంటూ ఎంత మొత్తుకుంటున్నా దర్శకుడు శంకర్ వల్ల నిర్మాత దిల్ రాజు సైతం ఏమీ చెప్పలేని పరిస్థితిలో చిక్కుకోవడం కళ్లారా చూస్తున్నాం. రెండేళ్లకు పైగా నిర్మాణంలో ఉన్నా ఇప్పటిదాకా టైటిల్ అనౌన్స్ మెంట్, ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ తప్ప ఇంకెలాంటి సమాచారమూ లేదు. ఆఖరికి ఎవరో టీమ్ మెంబర్ ఒక పాటను లీక్ చేస్తే దాన్ని విని సంబరపడటం ఫ్యాన్స్ వంతయ్యింది. అయినా ఆ సాంగ్ వైరల్ కాకుండా చట్టపరంగా డిలీట్ చేయడం వేరే సంగతి. ఈ సమస్యకు అసలు మూలం ఇండియన్ 2 అని వేరే చెప్పనక్కర్లేదు.
నిన్నటి నుంచి హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ మొదలైంది. చరణ్, అంజలి మధ్య కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కథ ప్రకారం వీళ్లిద్దరూ తల్లి కొడుకులుగా కనిపిస్తారని యూనిట్ టాక్. అయితే ఇది ఎన్ని రోజులు కంటిన్యూగా కొనసాగుతుందో చెప్పలేని సిచువేషన్. ఫలానా టైంకి అయిపోతుందని ఎవరూ నిర్ధారణ చేయలేకపోతున్నారు. ఇంకోవైపు ఇండియన్ 2 డబ్బింగ్ పనులు మొదలైపోయాయి. దానికి సంబంధించిన వీడియోని నిన్న లైకా సంస్థ షేర్ చేయడం మెగా ఫ్యాన్స్ కి మరింత మంట రేపింది. ఈ మాత్రం దానికి కూడా మేము నోచుకోలేదా అంటూ నిలదీస్తున్నారు.
అసలు గేమ్ చేంజర్, ఇండియన్ 2లో ఏది ముందు విడుదలవుతుందో తెలియదు. సంక్రాంతిని ఎలాగూ వదిలేసుకున్నారు. వేసవిని దేవర లాక్ చేసుకున్నాడు. ఇండిపెండెన్స్ డేని పుష్ప 2 తీసేసుకుంది. దసరాకు నమ్మకాల్లేవ్. 2025లో చరణ్ సినిమా రిలీజవుతుందనే ప్రచారం ఫ్యాన్స్ లో కలవరం రేపడం సహజం. పోనీ అలాగే అనుకున్నా అదేదో ముందే చెప్పేస్తే ఏ గొడవా ఉండదు. కానీ ఆ సూచనలు దరిదాపుల్లో లేవు. అవతల రామ్ చరణ్ తనతో చేయబోయే సినిమా కోసం దర్శకుడు బుచ్చిబాబు వెయిటింగ్ లో ఉన్నాడు. ఇంకో మూడు నాలుగు నెలలు నిరీక్షణ తప్పేలా కనిపించడం లేదు.
This post was last modified on October 10, 2023 12:50 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…