ఏజెంట్ సినిమా అంత పెద్ద డిజాస్టర్ అయినా దాని ప్రభావం మరీ తీవ్రంగా దర్శకుడు సురేందర్ రెడ్డి మీద పడలేదు. ఇది రిలీజ్ కాకముందే వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రాజెక్టు తనకో సంజీవిని కాగా ఇప్పుడు మరో క్రేజీ మూవీని చేజిక్కించుకున్నట్టు ఫిలిం నగర్ టాక్. విక్టరీ వెంకటేష్ 76వ చిత్రం సూరితోనే ఉండొచ్చనే ప్రచారం బలంగా జరుగుతోంది. సైంధవ్ చివరి స్టేజిలో ఉంది. జనవరి 13 విడుదల తేదీ లాక్ చేయడంతో టీమ్ చక్కగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటోంది. ఇండియా ఆడే వరల్డ్ కప్ మ్యాచులు మినహాయించి అవసరమైన డేట్లు దర్శకుడు శైలేష్ కొలనుకే ఇచ్చాడు వెంకీ.
ఇంత హఠాత్తుగా ఈ కాంబో గురించి ప్రచారం జరగడానికి కారణం లేకపోలేదు. సూరి చేతిలో ఉన్న పవన్ కళ్యాణ్ సినిమా మొదలుపెట్టడానికి 2024 వేసవి దాటిపోతుంది. ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు పూర్తి చేస్తే తప్ప పవర్ స్టార్ ఫ్రీ కాడు. పైగా వీటిలో ఒకటో రెండో సీక్వెల్స్ ఉంటాయని అంటున్నారు. అదే నిజమైతే ఇంకా ఆలస్యమవుతుంది. కాబట్టి అప్పటిదాకా ఖాళీగా ఉండాల్సి వస్తుంది. అయితే ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథని ఆ మధ్య వెంకీ, సురేష్ బాబులకు చెబితే వాళ్ళ నుంచి సానుకూల స్పందన వచ్చిందట. అందుకే కార్యరూపం దాల్చే అవకాశం లేకపోలేదు.
ఇంకోవైపు వెంకటేష్ జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కో కమిట్ మెంట్ ఇచ్చారు. అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. స్టోరీకి సంబంధించి ఏకాభిప్రాయం రాలేదట. శివ కార్తికేయన్ తో అతను చేసిన ప్రిన్స్ ఫ్లాప్ కావడంతో జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా లేట్ చేస్తున్నారని సమాచారం. అంతకు ముందు తరుణ్ భాస్కర్ తో అనుకున్నది కూడా క్యాన్సిల్ అయ్యింది. దాంతో అతను కీడా కోలాకు షిఫ్ట్ అయ్యాడు. మరి వెంకటేష్ ఫైనల్ గా ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో చూడాలి. సైంధవ్ రిలీజ్ అయ్యేవరకు వేచి చూద్దామన్నా ఆశ్చర్యం లేదు.
This post was last modified on October 9, 2023 10:24 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…